జైశ్రీరామ్.
వేదముల అర్ధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆరు అంగాలను వేదాంగములు అంటారు.
శ్లో. శిక్షా వ్యాకరణం ఛందో - నిరుక్తం జ్యోతిషం తథా
కల్పశ్చేతి షడంగాని - వేదస్యాహుర్మనీషిణఃII
శిక్ష: పాణిని శిక్షాశాస్త్రమును రచించెను. ఇది వేదమును ఉచ్ఛరింపవలసిన పద్ధతిని బోధిస్తుంది. వేదములలో స్వరము చాలా ముఖ్యము.
వ్యాకరణము: వ్యాకరణ శాస్త్రమును కూడ సూత్ర రూపమున పాణినియే రచించెను. ఇందులో 8 అధ్యాయాలున్నాయి. దోషరహితమైన పదప్రయోగమునకు సంబంధించిన నియమాలు అన్నీ ఇందులో చెప్పబడ్డాయి.
ఛందస్సు: పింగళుడు "ఛందోవిచితి" అనే 8 అధ్యాయాల ఛందశ్శాస్త్రమును రచించెను. వేద మంత్రములకు సంబంధించిన ఛందస్సులే కాక లౌకిక ఛందస్సులు కూడా ఇక్కడ చెప్పబడినవి.
నిరుక్తము: నిరుక్త శాస్త్రమునకు కర్త యాస్కుడు. వేదమంత్రములలోని పదముల వ్యుత్పత్తి ఇందులో చెప్పబడింది. పదములన్నీ ధాతువులనుండి పుట్టినవని యాస్కుని అభిప్రాయము.
జ్యోతిషము: వేదాలలో చెప్పిన యజ్ఞాలు చేయడానికి కాలనిర్ణయం చాలా ముఖ్యం. ఆ కాలనియమాలు జ్యోతిషంలో ఉంటాయి. లగదుడు, గర్గుడు మున్నగువారు ఈ జ్యోతిష శాస్త్ర గ్రంథాలను రచించారు.
కల్పము: కల్పశాస్త్రంలో యజ్ఞయాగాదుల విధానము, వాటిలోని భేదాలు చెప్పబడ్డాయి. అశ్వలాయనుడు, సాలంఖ్యాయనుడు ఈ శాస్త్ర సూత్రాలను రచించారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.