జైశ్రీరామ్.
ఉదయరాగం
శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్.
శా. ప్రాచీప్రస్ఫుటకాంతిపర్యుషణ
ప్రాభాతార్ఘ్యవారిస్ఫురత్
వీచీమాలికడోలికల్ జనమనో
ద్దీప్తంబులై పర్వెడిన్
రోచిష్మంతములై దిగంతములు
సద్యోజాతభిన్నాంబుజా
ళీచర్చాళినినాదముల్ శ్రుతుల
సారింపన్ మనోజ్ఞమ్ములై
వివరణ.
ప్రాచీదిక్ స్ఫుట కాంతి
-తూర్పుదిశలో ప్రకాశిస్తున్న వెలుగు - సూర్యుడు పర్యుషణ - ఆ సూర్యుని
పూజకొఱకై
ప్రాభాత+అర్ఘ్య-వారి-స్ఫురత్
-ఉదయసంధ్యార్ఘ్యజలములపవిత్రతతో కలసి
వీచీమాలికడోలిల్
-ఊయెలలూగుతూ ప్రసరిస్తున్న వాయువులు
జనమనోద్దీప్తంబులై పర్వెడిన్
-జనుల మనసులను ఉల్లాసంగా మేలుకొలుపుతున్నాయి..
రోచిష్మంతములై దిగంతములు
-దిక్కులన్నీ కాంతిమంతములై
సద్యోజాత-భిన్నాంబుజ+ఆళీ-చర్చ+అళి-నినాదముల్
-అప్పటికప్పుడే మొగ్గతొడిగి వికసిస్తున్న పద్మముల సమూహముల
యందలి మధువులను అలముకొన్న తుమ్మెదలనాదములు
శ్రుతుల సారింపన్
-వేదనాదములను ప్రసరింప జేస్తుంటే..
మనోజ్ఞమ్ములై కాంతిమంతములైన దిగంతములు..
మనోహరముగా అరుణారుణ కాంతులతో విరాజిల్లుతున్నాయి.
సుమధురపద్య నిర్మాణ దక్షులయిన
శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ గారికి అభినందనపూర్వక ధన్యవాదములు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.