గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మార్చి 2025, బుధవారం

చమత్కార ప్రార్థన. మామకు మామయైన పరమాత్ముఁడు మాకు బ్రసన్నుఁడయ్యెడున్. సమర్పణ శ్రీ వైద్యంవారు.

జైశ్రీరామ్. 

చమత్కార ప్రార్థన.

ఉ. మామను సంహరించి, యొకమామకు గర్వమడంచి, యన్ని శా

మామను రాజుజేసి, యొకమామతనూజునకాత్మబంధువై

మామకుగన్నులిచ్చి, సుతుమన్మథుపత్నికి దానె మామయై

మామకు మామయైన పరమాత్ముడు మాకు బ్రసన్ను డయ్యెడున్.

ఇందులో 8 మంది మామలున్నారు.

 1. కంసుడనే మామను చంపి,

2.సముద్రుడనే మామకు గర్వమణచి(రామావతారంలో)

3. చందమామను రాత్రికి రాజును చేసి (నానార్థాలలో రాజు అంటే చంద్రుడు అని ఒక అర్థం)

4. ఒకమామకొడుక్కు(అర్జునునికి) ఆత్మబంధవై,

5. ఒకమామకు కన్నులిచ్చి(రాయబారంలో ధృతరాష్ట్రునికి)

6. రతీదేవికి తానే మామయై,

7. సముద్రుడు విష్ణువుకు మామ,

8.ఈయనకు గంగను ఇచ్చినందున మామకు మామయైనాడు,

అటువంటి విష్ణువు ప్రసన్నుడై మాకు అనుగ్రహం కలిగించుగాక.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.