జైశ్రీరామ్.
మహాభారతేతిహాసంలో మహర్షి వేదవ్యాసుడు మనకు గీతామృతాన్ని అందిందించినారు. భారతంలో భగవద్గీతాదిగీతలు పదునారు (16) ఉన్నాయి.వాటి క్లుప్తపరిచయం.
1.భగవద్గీత : మహాభారతంలోనిభీష్మపర్వంలో25వ అధ్యాయంనుండి42వ అధ్యాయం వరకు18అధ్యాయాలలో విరాజిల్లుతోందిగీత.శ్రీకృష్ణభగవానుడు అర్జునుడికి చేసిన దివ్యోపదేశంభగవద్గీత.ఇది శాస్త్రంగ ఉపనిషత్తుగకీర్తించబడుతున్న దివ్యభాగం.
2.ఉతథ్యగీత : మహాభారతశాంతిపర్వంలోని2అధ్యాయాలలో(90-91)ఉతథ్యగీత ఉంది.బ్రహ్మజ్ఞానసంపన్నుడైన ఉతథ్యమహర్షి మాంధాతృచక్రవ ర్తికి ధర్మపరిపాలన ఆవస్యకతను ఉప దేశించిన భాగమిది.
3.వామదేవగీత : ఇదిశాంతిపర్వం లో ఉతథ్యగీత తర్వాత 3అధ్యాయాలలో(92-94)ఉంది.వామదేవమహర్షివనుమనుడికి ఉపదేశించి నాడని భీ ష్ముడు ధర్మరాజుకు చెప్తాడు.
4.ఋషభగీత : ఇదికూడ శాంతి పర్వంలోనే 4అధ్యాయాలలో(125-128)వివరించబడింది 'ఆశ' విషయంగ ధర్మరాజు అడిగిన ప్రశ్నకు భీష్ముడుఋషభుని ఉపదేశాన్ని వినిపిస్తాడు.
5.షడ్జగీత : ఇదికూడ శాంతిపర్వంలోని ఉపపర్వమైన ఆపద్ధర్మపర్వంలో ఒక (167) అధ్యాయంలో తెలుపబ డింది.ధర్మరాజు తన తమ్ముళ్లు మరియు విదురుడుధర్మార్థకామాలలోఏదిఉత్తమమైనదో అనే అంశంగురించి చర్చించబడిన విషయం కనుక దీనినిషడ్జగీత అని పేర్కొన్నారు.
6.శంపాకగీత : శాంతిపర్వంలోనిఒకే ఒక అధ్యాయం(176)లో విరాజిల్లుతోంది ఈ గీత.భీష్ముడిని ధర్మరాజుధనవంతులకూ నిర్ధనులకూ సుఖదుఃఖాలు ఏ రూపంలో సంక్రమిస్తాయనిప్రశ్నిస్తే శంపాకుడు చెప్పిన ఇతిహాసన్ని వివరిస్తాడు.
7.మంకిగీత : ఇదికాక శాంతిపర్వంలో శంపాకగీత తర్వాత ఉంది. ఇదికూడ ఒక అధ్యాయం(177)లో ఉంది. ధనాశతోఎంతో ప్రయత్నంచేసినవాడుదానిని పొందాలంటే ఎలా సుఖాన్ని పొందుతారు అన్న ధర్మరాజు ప్రశ్నకుభీష్ముడుసమాధానంగఈగీత చెప్తాడు
8.బోధ్యగీత : ఒక అధ్యాయంలో (178) విరాజిల్లుతున్న గీత ఇది. ఎలా టి బుద్ధినికలిగిఉంటేశాంతినీ సుఖాన్నీపొందవచ్చు అన్న ధర్మరాజు ప్రశ్నకు భీష్ముడు ఈ గీతను చెప్తాడు.
9.విచఖ్నుగీత : ఇది శాంతిపర్వం లోని ఉప పర్వమైన మోక్షధర్మపర్వంలో(265అధ్యాయం) ఉంది. దీనిలోఅహింస ప్రశంస ఉంది.
10.హారితగీత : శాంతిపర్వం 278అధ్యాయంలోఉంది.పరబ్రహ్మను పొందేవారి ప్రవర్తన స్వభావం ఎలాఉండాలనే హారితుని ఉపదేశం ఇది.
11.వృత్రగీత : ఇది ఒకఅధ్యాయం (279) లో ఉపవర్ణితం. కర్మఫలం గు రించి శుక్రాచార్యుడు వృత్రునికి బోధించిన గీత ఇది.
12 పరాశరగీత : శాంతి పర్వం లోని 290-298అధ్యాయాలలో ఈగీత ఉంది. తొమ్మిది అధ్యాయాలున్నదీనిలో--మానవుడుఏశుభకార్యాలను ఆచరించి ఇహ పర లోకాలలో పరమశ్రేయస్సును పొందగలడనే విషయంజనక పరాశర సంవాదరూపకంగఉంది
13.హంసగీత : ఇది శాంతిపర్వం లో 299వ అధ్యాయం. సత్య దమాదిప్రశంస దీనిలో ఉంది.
14.బ్రాహ్మణగీత: అశ్వమేధపర్వంలోని అనుగీతపర్వం లో15వఅధ్యాయాలలో(206-346)శ్రీకృష్ణుడు అర్జునకు చేసిన ఉపదేశం ఇది.
15.అనుగీత : బ్రాహ్మణగీతానంత రం ఈ గీత 17 అధ్యాయాలలో(35-51)ఉన్న అనుగీత గురుశిష్య సంవాదరూపాత్మకం. అర్జునుడు తనకు శ్రీకృష్ణుడు చేసిన గీతోపదేశం మరిచానని చెప్పగా ఆ విషయ పరిజ్ఞానాన్నికలిగించే ఇతిహాసాన్ని భగవానుడుఉపదేశించిన ఇందలి విషయం.
16.యాజ్ఞవల్క్య గీత: భారత శాంతిపర్వంలోని 310అధ్యాయం నుండి 318 అధ్యాయం వరకూ ఈగీతను యజ్ఞవల్క్యమహర్షి జనకు నకు చేసిన సృష్టివర్ణనాదులు కలిగినగీత ఇది.
ఇంతటి సద్విషయ సమాహార గీతలు మహాభారత శాంతిపర్వం మనకు అందిస్తుంది.
సంస్కృత మహాభారత శాంతిపర్వం తెలుగువ్యాఖ్యానంఉన్నదిగీతాసక్తులు తప్పక అధ్యయనం చేయగలరు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.