జైశ్రీరామ్.
శ్లో. ఆత్మైవ హ్యాత్మనో బన్ధుః - ఆత్మైవ రిపురాత్మనః l
ఆత్మైవ హ్యాత్మనః సాక్షీ - కృతస్యాపకృతస్య చ ll (మహాభారతమ్)
తే.గీ. తనకు తానెయౌ బంధువు, తనకు తానె
శత్రువరయఁగ నరునకు, ధాత్రిపైన
చేయుచున్నట్టి మంచికి చెడ్డ కరయ
నాత్మయే సాక్షి మనిషికి, నాత్మఁగనుము.
భావము. " మంచిపని చేసినా, చెడ్డపని చేసినా.....మానవుడు తనకు తానే
బంధువు, తనకు తానే శత్రువు, తనకు తానే సాక్షియగుచున్నాడు."
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.