గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, డిసెంబర్ 2024, సోమవారం

పిపీలకార్జితం ధాన్యం. ... మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  పిపీలకార్జితం ధాన్యం - మాక్షికా సంచితం మధు౹

లుబ్ధేన సంచితం ద్రవ్యం - సమూలం చ వినశ్యతి ౹౹      

తే.గీ.  చీమలార్జించు దినుసు నశించిపోవు,

మక్షికార్జిత మధువును మాయమగును,

పిసిని సంపాదననశించు విశ్వమునను,

దాచు కొనునట్టిదెల్లయు దోచఁవడును.

భావము.  చీమలు సంగ్రహించిన ధాన్యం, తేనీటీగలు కూడబెట్టిన తేనె, అలాగే 

లోభి కూడ్చి పెట్టిన ధనం ఇవన్నీ స్థిరంగా లేకుండా నాశనము అయ్యేవి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.