జైశ్రీరామ్.
శ్లో. ద్రోగ్ధవ్యం న చ మిత్రేషు న విష్వస్తేషు కర్హిచిత్ ౹
యేషాం చాన్నాని భుంజీత యత్ర చ స్యాత్ ప్రతిశ్రయః ౹౹
(మహాభారతమ్ 3.154.13)
తే.గీ. స్నేహితులయెడలను, విశ్వసించువారి
యెడల, మృష్టాన్న దాతల యెడల, తనకు
తానుగా నాశ్రయంబిచ్చు ధన్యులయెడ,
ద్రోహమొనరింపరాదయా, దురితమొదవు.
భావము. మిత్రుల విషయములో, విశ్వాసం పెట్టుకున్నవారివిషయములో,
ఎవరి అన్నము స్వీకరింతురో అటువంటి వారివిషయములో, మరియు
తనకు తానుగా ఆశ్రయము ఇచ్చిన వారి విషయములో ద్రోహం
ఎప్పటికీ చెయ్యరాదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.