జైశ్రీరామ్.
శ్లో. ధర్మో మాతా పితా చైవ
ధర్మో బంధుః సుహృత్తథా।
ధర్మః స్వర్గస్య సోపానం
ధర్మాత్ స్వర్గ మవాప్యతే ॥
(చాణక్య నీతి)
తే.గీ. ధర్మమే తల్లి, తండ్రియు ధర్మమేను,
ధర్మమే సఖుఁడెన్నగా మర్మరహిత!
ధర్మమే మెట్లు దివిఁ జేర, తరచి చూడ,
ధర్మమున స్వర్గమొదవును, ధాత్రిజులకు.
భావము. ధర్మమే తల్లి, తండ్రి, బంధువు, మంచి కోరే మిత్రుడు.
ధర్మమే స్వర్గానికి సోపానం. ధర్మము వలననే స్వర్గాన్ని సంప్రాప్తిస్తుంది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.