జైశ్రీరామ్.
శ్లో. త్రిభిఃవర్షైః త్రిభిర్మాసైః - త్రిభిఃపక్షైః త్రిభిర్దినైః |
అత్యుత్కటైః పుణ్యపాపైః - ఇహైవ ఫలమశ్నుతే ||
తే.గీ. కలియుగంబున చేసెడి కర్మఫలము
మూడు వత్సరములలోనొ, మూడు నెలల
లోనొ, మూడుపక్షములందొ, గాన ననుభ
వించుదుము దినత్రయమందొ, విశ్వభాస!
భావము. ఈ కలియుగంలో మనం చేసే పాపపుణ్యముల స్వభావాన్ని అనుసరించి
వాటి ఫలములను మూడు సంవత్సరాలు, మూడు నెలలు, మూడు పక్షాలు
లేదా మూడు దినములలో అనుభవిస్తాము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.