గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, డిసెంబర్ 2024, సోమవారం

కోఽతి భారః సమర్థానాం! ... మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  కోఽతి భారః సమర్థానాం!  -  కిం దూరం వ్యవసాయినాం!

కో విదేశః సవిద్యానాం!  -  కః పరః ప్రియవాదినాం!!

తే.గీ.  భారమేముండు నిపుణతన్ వరలినపుడు,

కష్టజీవికి దూరమే కనఁవడదుగ,

వినగ పరదేశమేముండు విద్య కలుగ,

పరులు ప్రియభాషికుండరు భక్తవరద!  

భావము.  సమర్థులకు ఏదీ భారం కాదు. కష్టపడే వారికి ఏదీ దూరం అనిపించదు. 

చదువుకున్న వారికి ఏ చోటూ పరాయి ప్రాంతం కాదు. ప్రియంగా మాట్లాడే వారికి 

ఎవరూ పరాయి వారు కాదు. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.