జైశ్రీరామ్.
అవధాని: నల్లాన్ చక్రవర్తుల సాహిత్
17వ అష్టావధానము
వేదిక: B 1 MULTIPURPOSE HALL ZENITH CLUB HOUSE
తేదీ: 1-12-2024
సంచాలకులు: శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నాయణ మూర్తి గారు
నిషిద్ధాక్షరి- క్షిప్రావధాని , అవధాన రాజహంస శ్రీ ముద్దురాజయ్య గారు
అంశం: శ్రీకృష్ణ కుచేలుల మైత్రి/ కుచేలోపాఖ్యానము
(శ) ఇ(ల)చ్చెన్ (మ)శ్రీ(మ)లన్ (ప)నె(ల)య్య(మ)పు
(-)టిచ్చన్ (వ)దీ(న)ర్చెన్ (ల) గ(ల)రీం(బ)ద్ర(-)భృ(ద)న్మే (ద) న(-)త(గ)తోన్....
కందము
ఇచ్చెన్ శ్రీలన్ నెయ్యపు
టిచ్చన్ దీర్చెన్ గరీంద్ర భృన్మేనతతోన్
యచ్చెరువా? హరి చూపుల
పచ్చగ మారదొకొ బీడుపడు ధరయైనన్!!
సమస్య-శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారు
సమస్య: నన్నయగారమొందుగతి నాట్యము జేసె జనమ్ముమెచ్చగన్
ఉత్పలమాల:
తిన్నగ నాంధ్ర భాష దశదిక్కుల నిల్పిన దివ్యశేముషీ
మన్నర రూప శారద, సమస్త కవిత్వ రహస్య విజ్ఞతా
సన్నిధి - పల్కుమువ్వలను శాస్త్రము ముద్రలు దాల్చి హేలగా
నన్నయ గారమొందుగతి నాట్యము జేసె జనమ్ము మెచ్చగన్
(ఆఖరిపాదమేసమస్య)
దత్తపది- సంచాలక చక్రవర్తి సంచాలక ద్యుమణి శ్రీ కటకంవేంకట రామ శర్మ గారు
ఎద -సొద- పొద- రొద
అంశం-
పదములను అన్యార్థంలో సాంకేతిక విద్యకి సంబంధించిన విధంగా పద్యం చెప్పాలి,,ఉత్పలమాల లో
ప్రాతిగ దేశమును నిలుపు పద్ధతినా యె (ద) తరింప జేయ, సాం
కేతిక విద్య యిం పొద వ "కృత్రిమ మేధ"గ రూపుదాల్చె,సం
పాతియె యన్నతీ రొ!ద డిమాపెను 'కృత్రిమ సత్య"వేషమై
జాతికి నిద్ది యా సొ? ద మ సత్వవిహినత యున్నత్రాసమో!!
*కృత్రిమ మేధ: Artificial Intelligence
*కృత్రిమ సత్యము: Augmented Reality
న్యస్తాక్షరి చిత్రకవితా సమ్రాట్ శ్రీ చింతా రామకృష్ణా రావు గారు
అంశం-అవధాన ప్రజ్ఞావైభవం
శార్దూలంలో చెప్పాలి
1-13- వా,2-2-ఙ్నై, 3-9-పు, 4- 11-ణి.... (వాఙ్నైపుణి)
వాఙ్నిర్మాణము, ధారణా పటిమ, సం'వా'ద ప్రవీణత్వమున్
ప్రా'ఙ్నై'సర్గిక తత్వవేత్తృతయు, దుర్వారోరు ధైర్యమ్మునున్
దృఙ్నిర్యత్ శమమాధురుల్ 'పు'రత ఆతిష్ఠత్ జనుల్ మెచ్చగా
వాఙ్నారీ పదసంస్థిత ద్యుమ'ణి' సంభాసుల్ వధానుల్ మునుల్!!
వర్ణన- శ్రీమతి కొడుకుల సుశ్లోక సాహితి గారు
అంశం- భక్త ప్రహ్లాదుడికి నారసింహుడు కనిపించినతీరు మత్తకోకిలలో చెప్పాలి
కోరలూయలలై కనంబడు, గోర్లు కేళికి నిక్కలై
క్రూరఘాతక దృక్చయమ్ములు కూర్మి చూపుచు నుండగన్
తారకంబగు మంత్రమొక్కట తారసిల్లుచు నుండగన్
నారసింహము బాలమూర్తికనారతమ్ము సుఖంబుగన్!!
ఆశువు అంశమును శ్రీ పి.కనకరాజు గారు గారు నిర్వహించినారు
*అంశం- కావ్యగానం శ్రీ వంజారి శివరామకృష్ణగారిచే నిర్వహింపబడినది
అప్రస్తుత ప్రసంగం శ్రీ మల్లాప్రగడ నందకిశోర్ గారిచేత నిర్వహించబడినది.
నా ప్రారంభ పద్యం.
శ్రీన్నిత్యంబు మనంబునన్ గొలుచు ధీశ్రీమంతుడౌ సాహితున్
మన్నింపంబడు పండితుల్ నుతిగ ప్రేమన్ వెల్గ దీవించుతన్,
నన్నున్ ధన్యుని జేయునట్టి ఘనులౌ జ్ఞానాబ్ధి యైనట్టి శ్రీ
మన్నారాయణు గొల్చెదన్ జయములన్ మాకున్ బ్రసాదింపగన్.
న్యస్తాక్షరి. నాపూరణము.
[1:20 pm, 1/12/2024] Chinta Ramakrishnarao: వాఙ్నైపుణి
అవధానికుండే ప్రజ్ఞావైభవము. శార్దూలవృత్తములో
1 – 13 వా
2 - 2 ఙ్నై
3 - 9 పు
4 - 11 ణి
వాఙ్నైర్మల్య సుభాషణుండు, కనగా "వా"ణీ తనూజుండొ? స(13)
ద్వా"ఙ్నై"పుణ్యమనోజ్ఙ సంస్తుతఘృణుల్ వ్యాపించగా దిక్కులన్,(2)
దిఙ్నాగంబులె మెచ్చె నీ "పు"డమిపై నిష్ణాతుఁడై వెల్గు నీ(9)
వాఙ్నీమాంచిత సద్వధానమ"ణి", శ్రీభాస్వంత సాహిత్, భళీ!(11)
జైహింద్.
1 comments:
🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.