18-12-2024వ తేదీన మద్యాహ్నం 2గంటలకి
శ్రీ వాడ్రేవు వేంకట సత్య ప్రసాదు గారింట జరిగిన
శ్రీ డా. అక్కిరాజు సుందరరామకృష్ణ గారు
సాధనావధానంలో పూరణ చేసిన పద్యములు.
సంచాలకులు గా
శ్రీ ధూళిపాళ మహదేవమణిగారు నిర్వహించినారు.
ముఖ్య అతిథిగా
చిత్రకవితా సమ్రాట్ శ్రీ చింతా రామ కృష్ణారావుగారు అలరించారు
నిషిద్ధాక్షరి
అవధాన రాజహంస శ్రీ ముద్దురాజయ్య గారు
అంశం- శ్రీలలితాంబికను వర్ణించాలి
శ్రీ(వ)ర(మ)యి(మ)ర(స)యి(గ)నాన్ (వ )శ్రీ (న) తోన్..
యార (య)భి(ద)నా(ద)టన్- మ(ద)రి-(మ)-రి-యా(ట)పీ(య)లున్ లే....
కందము
శ్రీరయి రయినాన్ శ్రీతో
యారభి నాటన్ మరిమరి యాపీలున్ లే
శౌరికి పత్నివి నీవదె
మారుని మదిగన్నతల్లి మంగళ రూపా!
సమస్య
శ్రీ మాచవోలు శ్రీధర రావు గారు
పద్యమల్లుట సులభమ్ము పామరునకు
తే.గీ!
శారదాదేవి కృపయున్న చాలినంత
సరుకు లిచ్చును తప్పక చల్లగాను
మాటనమ్ముర నాదహోమాచవోలు
అమ్మ దయయున్న సత్యమ్ము నమ్ముమయ్య
*పద్యమల్లుట సులభమ్ము పామరునకు*
(ఆఖరి పాదమే సమస్య)
దత్తపది
శ్రీ వేంకట స్వామిగారు
అంశం
ప్రేమ- అనే పదమునునాలుగు పాదాలలోనూ వుంచుతూ
నాటి నేటి సినిమాలు.
ప్రేయసికి చాకు చూపుట పిచ్చి ప్రేమ
పిచ్చిమాటలు ప్రేలుట వింత ప్రేమ
గుడిని తాళిని కట్టెడి గొప్ప ప్రేమ
పాట పాడుట నానాడు ప్రేమ!!
వర్ణన
శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి
అంశం- మార్గశీర్ష మాసమంచు నిపూలవానగా మత్తచభంలో చెప్పాలి
అతివా! మార్గశిరంబె మంచుగదటే ఖ్యాతిని గనెన్ గాదటే
కుతుకం బొప్పగ విష్ణు పూజలను పెక్కుర్ సల్పరే మానినీ
ప్రతిరోజున్ మరి సుప్రభాతములలో భక్త్యాత్ములై యెల్లరున్
సతమా మంచునె పాలుగా దలుచుచున్ చక్రిన్ గొల్వరే!!
కవితాగానం
శ్రీక్రొవ్విడివెంకట రాజారావుగారు..
పౌరాణిక అంశాలని ప్రస్తావిస్తే ఆవధానిగారు సందర్భోచితంగా పద్యాలని అలవోకగాచెప్పారు
ఆశువు
శ్రీ కవిశ్రీ సత్తిబాబుగారు
అంశం-కపట సన్యాసి విన్యాసం
(వీరు తమ అంశాన్ని పద్యంలో అడిగారు)
కలిని నెప్పుడైరి కపట సన్యాసులు
వాణినాలయేడు క్షోణియందు
నిజము చూడ భళిర! నేర్పు మీరంగను
నధిక గౌరవంబు ఖ్యాతి గనిరి!!
*ఆశువు-2
అంశం- మాయాజలధినిదాటాలంటే ఏమి చేయాలి?
ఆ.వె మాయ సకల జగతి మాయరా నమ్మరా
సత్యమిద్ది నమ్ముసత్తిబాబు
శ్రీ హరినిని భక్తి సేవింప మెరుగురా
యిదియె మార్గమయ్య బుధవరేణ్య!!
ఆశువు-3
అంశం- కపటవిద్యాచరుడు
ఆ.వె! బొబ్లుపెట్టి మెడను పూసదండలువేసి
భక్తి పరుడు వోలె భావనమున
బ్రతుకు వాడెనిజము క్షితి పైన దొంగరా
సత్య మిద్దె నమ్ము సత్తి బాబు!!
ఛందోభాషణము
శ్రీ ధనికొండరవిప్రసాదు గారు
1--నిధి సుఖమా? రాముని స
న్నిధి సుఖమా?
జ కవివర విను నిక్కంబిదిరా
నిధి లేక బ్రతుకు గడుచున?
వ్యధపాలగు దలచిచూడ పండితవర్యా!!
ఆశువు-3
అవధానమ్ముల కొన్ని చేసితిరి కావ్య సృష్టిన్ చేసిరే?
భువిపై యాబది మూడు పుస్తకములన్ నే పొల్పార నే వ్రాసితే
స్తవనంబుల్ పలు చూపుచున్ వెల్గుగాక నవి మీ సామర్ధ్యమున్ జూపచున్
పవనాత్మజుడు నైనవాని కృపతో భాసిల్లిడిన్ సోదరా!!
అప్రస్తుత ప్రసంగము
శ్రీ సంచాలక చక్రవర్తి , ద్యుమణి శ్రీకటకం వేంకటరామశర్మ గారు
నిర్వహించినారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.