జైశ్రీరామ్.
శ్లో. పితృభి స్తాడితో పుత్రః ౹ - శిష్యస్తు గురు శిక్షితః ౹
ఘనాహతం సువర్ణం చ ౹ - జాయతే జనమండనమ్౹౹
తే.గీ. తల్లిదండ్రుల దండనవల్ల సంతు,
గురు సుశిక్షిత శిష్యుఁడు, నిరుపమముగ
భువి ఘనాహతమైనట్టి పుత్తడియును
కనగ జనమండనంబగు ఘనతరముగ.
భావము. తల్లిదండ్రులచే దండింపఁబడు సంతానము, గురువుచే
శిక్షితుఁడయిన శిష్యుఁడు, అలంకారముగా చేయఁబడునప్పుడు
సుత్తి దెబ్బలు తిన బంగారము సమాజములో అలంకారముగా అగుట నిశ్చయము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.