7, నవంబర్ 2024, గురువారం
సౌందర్యలహరి 26 - 30పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు, సంగీతం, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.
0 comments
6, నవంబర్ 2024, బుధవారం
క యితి బ్రహ్మణో నామ,. ... మేలిమిబంగారం మన సంస్కృతి. కేశవాయ స్వాహా అని పరిషేచన లో మొదటగా అనుటకు ముఖ్య కారణం.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. క యితి బ్రహ్మణో నామ, - ఈశోహం సర్వ దేహినాం,
ఆవాం తవాంగే సంభూతౌ - తస్మాత్ కేశవ నామవాన్.
తే.గీ. కయన బ్రహ్మనామంబగు, కనుమ నేను
నీశుఁడను దేహులకు హరీ! యెపుడు మేము
నీదు దేహంబుననునుంట, నిఖిల పతిరొ!
కేశవుండుగ నీపేరు భాసిలునయ.
భావము. కేశవ అను విష్ణునామములో క యనునది బ్రహ్మనామము, ఈశ అనునది
శివనామము, సమస్తదేహములందు ఉండు కేశవుని దేహములో బ్రహ్మ,
ఈశ్వరుఁడు ఉన్నందున విష్ణువునకు కేశన అను నామము లకుగెను.
త్రిమూర్తులకు ప్రతీకగా నిలుచు ఈ కేశవ నామమే పూజాదికములలో
ప్రథమముగా ఆచమనసమయమున చెప్పబడుచుండును. అంతటి
వైశిష్ట్యము కలదీ కేశవ నామము.
జైహింద్.
ఆర్తానాం ఆర్తి హంతారం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. ఆర్తానాం ఆర్తి హంతారం - భీతానాం భయనాశనం
ద్విషతాం కాలదండం తం - రామచంద్రం నమామ్యహం.
తే.గీ. ఆర్తులకునార్తిఁ బాపెడి యమృతమూర్తి,
భీతులకు భీతిఁ బాపెడి వేదమూర్తి,
ద్విషుల పాలిటి యముఁడగు దేవదేవుఁ
డట్టి శ్రీరామచంద్రునకంజలింతు.
భావము. దుఃఖితుల దుఃఖమును నశింపఁ జేయువాఁడును,
భయపడువారి భయమును పోఁగొట్టువాఁడును, శత్రువులకు
యమపాశమైనవాఁడు అగునట్టి రామచంద్రునకు నేను
నమస్కరించుచున్నాను.
జైహింద్.
సౌందర్యలహరి పద్యాలు 21-25. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు, సంగీతం, గానం...శ్రీమతి వల్లూరి సరస్వతి.
0 comments
5, నవంబర్ 2024, మంగళవారం
స వేద శాస్త్ర ధ్వని పూరితాని . ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. స వేద శాస్త్ర ధ్వని పూరితాని - స విప్ర పాదోదక కర్దమాని |
స్వాహా స్వధాకార నిరంతరాణి - వైకుంఠ తుల్యాని గృహాణి తాని ||
తే.గీ. వేదశాస్త్రాసాధననొప్పు వేశ్మ మొకటి,
వేదపండితులడుగిడు వీడదొకటి,
దేవపితృసేవలను దేల్చు దిష్ట్యమొకటి
కనగవైకుంఠసమమని కనగవలయు.
భావము. "ఏ ఇంట్లో వేదశాస్త్రాల ధ్వని ప్రతిధ్వనిస్తుందో, ఏ ఇంట్లో బ్రాహ్మణుల
మరియు వేద పండితుల అడుగుల చిహ్నాలు ఉంటాయో, ఏ ఇంట్లో నిరంతరం
దేవతల ఆరాధన (స్వాహాకారం), పితృవుల ఆరాధన (స్వధాకారం) జరుగుతుందో,
ఆ ఇల్లు సాక్షాత్ వైకుంఠంతో సమానమవుతుంది.
జైహింద్.
సౌందర్యలహరి పద్యాలు 16-20. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం. శ్రీమతి వల్లూరి సరస్వతి.
0 comments
4, నవంబర్ 2024, సోమవారం
ఉజ్జ్వలగుణమభ్యుదితం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. ఉజ్జ్వలగుణమభ్యుదితం - క్షుద్రో ద్రష్టుం న కథమపి క్షమతే |
దగ్ధ్వా తనుమపి శలభః - దీప్తం దీపార్చిషం హరతి ||
(ప్రబంధచింతామణి)
కం. ఎదుగుచునొదిగినవాఁడన
మదిమెచ్చఁడు దురితుఁడెపుడు, మాత్సర్యముచే,
పదపడి జ్వాలను ఝల్లిక
వదలక చేరుచు నశించు, భక్తవరదుఁడా!
భావము. ఉత్తమ గుణాలతో అభివృద్ధి చెందుతున్నవారిని చూసి నీచుడు
ఎట్టి పరిస్థితుల్లోనూ తట్టుకోలేడు. చిమ్మటపురుగు తన శరీరాన్ని కాల్చుకున్నా,
వెలిగే దీపాన్ని ఆశ్రయిస్తుంది.
జైహింద్.
యదధీత మవిజ్ఞాతం. ... మేలిమిబంగారం మన సాంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. యదధీత మవిజ్ఞాతం - నిగదేనైవ శబ్ధ్యతే
అనగ్నావివ శుష్కేంధౌ - నతజ్జ్వలతి కర్హిచిత్.
తే.గీ. అర్థమెఱుఁగుచు చదివిన వ్యర్థమవదు
మంత్రమైననునేదైన మహితులార!
అర్థమెఱుగక చదివిన వ్యర్థమగును,
అగ్ని లేనట్టి కట్టెలట్లరసి చూడ.
భావము. చదివిన దానికి తప్పక ఆర్థము తెలుసుకొన వలయును.
జప మంత్రములకు జప కాలములో అర్థ భావన చేయ వలయును.
అర్థము తెలియని అక్షర జపము వలన అగ్ని లేని యెండు కట్టెలు వలె
అది జ్వలించదు.
జైహింద్.
సౌందర్యలహరి 11-15పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు, సంగీతం, గానం. శ్రీమతి వల్లూరి సరస్వతి.
0 comments
3, నవంబర్ 2024, ఆదివారం
నీచతా,నితర,దిగు వొనరు,సిద్ద కొరుకు,పౌరషత్వ,నేర నైజ,కావని,నిటలాక్ష,దంత భ్రష్ట, మాయు,గుణ భావ,సామరస్య,మేలగు,జ్ఞానతా,గర్భ"పరాపరాధ"వృత్తము, రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ,
0 comments
జైశ్రీరామ్.
జైహింద్.
అభిజ్ఞా,స్వభావ,శ్రీభద్ర,పరమహంస,భాసిలు,వాటము,వడిన్,సాదృశ,సంసార,శ్రీం,సౌభాగ్య, ప్రవీణతా,ఎనలేని,గర్భ"శ్రీలం బ్రోవు"-వృత్తము,రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ,
0 comments
జైశ్రీరామ్.
జైహింద్.
సమరస,స రమస,అగణిత,తమి విడు,విమలత,సరి గను,ధనమదె,ఘనుమిల,ఘన స్థితి. వరదమ,కనె దిల,వెలుగిడు,సరి జను,జన హిత,"గర్భ. "విమల పద"వృత్తమురచన -వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి జుత్తాడ,,,
0 comments
జైశ్రీరామ్.
సమ రస స రమసతన్! చను మగణిత ఖనివై! జన మనముల మంచిన్!
రామాయణ శంఖారావంలో డా. గోపాల్రావు గురుదేవుల ప్రసంగం.Sriman Dr Ayalasomayajula Gopala Rao Speech At 𝐑𝐚𝐦𝐚𝐲𝐚𝐧𝐚 𝐒𝐡𝐚𝐧𝐤𝐡𝐚𝐫𝐚𝐯𝐚𝐦 | 𝐖...
0 comments
సుమహాంత్యపి శాస్త్రాణి ... మేలిమి బంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. సుమహాంత్యపి శాస్త్రాణి - ధారయంతో బహుశ్రుతాః |
ఛేత్తారః సంశయానాం చ - క్లిశ్యంతే లుబ్ధమోహితాః ||
(హితోపదేశం)
తే.గీ. కఠినమౌ శా స్త్రవిజ్ఞానఘనత కలిగి,
విషయములు పెక్కు తెలిసియు, ప్రీతి నితర
జనుల సంశయచ్ఛేదకుల్ జగతిలోన
లోభమోహాదులన్ జిక్కి క్లేశపడెడు.
భావము. కఠినతమమైన శాస్త్రాల జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు, అనేక విషయాలను
విని తెలుసుకున్నవారు, మరియు ఇతరుల సందేహాలను తొలగించే సామర్థ్యం
ఉన్నవారు కూడా లోభం మరియు మోహానికి లోనై కష్టపడతారు.
జైహింద్.