గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జులై 2023, గురువారం

అహింసా ప్రధమం పుష్పం,.. మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్. 
శ్లో:- అహింసా ప్రధమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః 
సర్వ భూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః 
శాంతి:పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తధైవచ 
సత్యమష్ట విధం పుష్పం విష్ణో:ప్రీతికరం భవేత్. 
 
చం. విమల యహింసయున్ మరియు వెల్గెడి యింద్రియ నిగ్రహంబు,భూ 
తములెడ నంతులేని దయ, తాల్మియు, శాంతి, తపంబు, ధ్యానమున్, 
ప్రముదము గొల్పు సత్యమను భాసిలు పుష్పచయంబు, వీటితో 
సుమధుర భావనన్ హరిని శోభిలఁ గొల్చిన ప్రీతిఁ జెందెడున్. 

 భావము:- అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వ భూత దయ, ఓర్పు, శాంతి, పరమాత్మకై తపించుట, పరమాత్మ ధ్యానము, సత్యనిరతి అనే ఎనిమిది విధములైన పుష్పములతో హరిని ఆరాధిస్తే చాలా సంతోషిస్తాఁడు హరి. జైహింద్.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.