గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జులై 2023, శుక్రవారం

బ్రాహ్మణక్షత్రియవిశాం - ...18 - 41...//... శమో దమస్తపః శౌచం - ...18 - 42,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

జై శ్రీరామ్

శ్లోబ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం పరన్తప|

కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః. || 18-41 ||

తే.గీ. బ్రాహ్మణ, క్షత్రియుల, వైశ్య వర్ణ, శూద్ర

జాతి కర్మలు నిజ భావ జనితమయిన

లక్షణములనుబట్టియే లక్ష్యముగను

భువిని విభజింపబడె పార్థ! పూర్తిగాను.

భావము.

పరంతపా! బ్రాహ్మణ , క్షత్రియ, వైశ్య, శూద్రుల కర్మలు వాళ్ళ స్వభావం నుండి 

జనించిన లక్షణలను బట్టి విభజింప పడినాయి.

శ్లోశమో దమస్తపః శౌచం క్షాన్తిరార్జవమేవ |

జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్. || 18-42 ||

తే.గీ. శమము, దమ, తప స్సౌచముల్, క్షాంతి, యార్జ

వమును, జ్ఞాన, విజ్ఞానముల్, వరలుచుండి,

ధరణినాస్తిక్య మనునవి  తప్పక భువిఁ

గలుగు సహజంబుగా బ్రాహ్మణులకు పార్థ!

భావము.

శమము, దమము, తపస్సు, శౌచము, ఓర్మి, ఋజుత్వము, జ్ఞాన విజ్ఞానాలు

ఆస్థిక భావము---ఇవి బ్రాహ్మణులకు స్వభావ సిద్ధమైన కర్మలు.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.