గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జులై 2023, మంగళవారం

పరోక్షే కార్యహంతారం ... మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  పరోక్షే కార్యహంతారం 

ప్రత్యక్షే ప్రియవాదినమ్

వర్జయేత్తాదృశం మిత్రం

విషకుంభం పయోముఖమ్

తే.గీ.  మన పరోక్షమునంతిట్టు మనను దురితుఁ

డెదురు పడినచో పొగడు, నటించు ప్రేమ,

వీడు క్షీరపూర్ణాహిత విషఘటంబు

విడువవలెనిట్టి మిత్రునిన్ వేగిరముగ.

భావము:-

ఎవడైనా ఒక దుష్టుడు ఒకవ్యక్తి చేసే మంచి పనులను చాటుగా విమర్శిస్తూ 

ఆ వ్యక్తి నాశనాన్ని కోరుకుంటూ మళ్లీ మంచిపనులు చేసే ఆ వ్యక్తి 

ఎదురు పడినప్పుడు స్నేహితుని వలె నటిస్తూ గౌరవంగా 

మాట్లాడుతున్నట్లైతే అటువంటి వానిని దూరంగా ఉంచాలేగాని 

స్నేహితునిలా చేరదీయకూడదు..... సుగంధద్రవ్యములతో 

ఘుమఘుమలాడుతున్న తీయని పాలు కడువడున్నా అందులో 

విషమున్నట్లైతే ఎవరైనా ఆ పాలకడవని దూరంగా వదిలుదురు కాని 

తీయగా ఉన్నా యని త్రాగరు కదా!

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.