గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జులై 2023, శుక్రవారం

భక్తిసాధనం అందించిన పురస్కారం అమ్మవారికే అంకితం.

జైశ్రీరామ్.

అమ్మా పండరి భక్తిసాధనము నాకందించె నీ సత్కృతిన్,
సమ్మాన్యంబులు సత్కృతుల్ గొనెదవే సత్ పూజ్యమౌ దేహివై,
యిమ్మాన్యత్వము నీది, నీవెకద నాయీదేహమందుండి నన్
సమ్మోదమ్మున సత్యకర్మపరతన్ సాగింతువే శాంభవీ!

బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణమహోదయులకు నా ధన్యవాదములు.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.