గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జులై 2023, ఆదివారం

చిత్రకావ్యం-బంధకవిత్వం -గ్రంథపరిచయం- ..... శ్రీ వైద్యంవేంకటేశ్వరాచార్యులు

 జైశ్రీరామ్.

 చిత్రకావ్యం-బంధకవిత్వం

  -గ్రంథపరిచయం-

ఆశు,మధుర,చిత్ర, విస్తరకవిత్వంలో చిత్రకవిత్వం ఒకటి.

ప్రపంచంలో దాదాపు అన్నిప్రసిద్ధ భాషలలోనూ చిత్రకవిత్వం

ఉంది.అయితే  సంస్కృతంలో ఉన్నంత  చిత్రకవిత్వం  ఇతర

భాషలలో మృగ్యము.

అలంకారగ్రంథాలలో దండి కావ్యాదర్శం నుంచీ నేటిదికా

బంధకవిత్వం   వివిధ  ప్రాంతాలనుంచీ,  వివిధ  కాలాలలో వివిధ  

పండితుల కలాలనుంచి వెలువడుతూ నే ఉంది.

ప్రస్తుతం"చిత్రకావ్యమ్"అనేరచనలోఉండిన చిత్రబంధాలను

గురించి నామమాత్రంగా తెలుసుకుందాం.

ముందుగా  "చిత్రకావ్యం"  రచించిన కవివర్యుని  గురించి

సంక్షిప్తంగా-- 

"చిత్రకావ్యం"ను రచించినమహాకవివర్యులు శ్రీమాన్.ఉ.వే.

శ్రీరామభద్రాచారియర్.వీరికి శ్రీరామభద్రకవి అని కూడా వ్యవ

హారం.  వీరి  జన్మస్థలం  'కోయంబత్తూ రు'కు  సమీపానగల

"సుందపాలయం".

 శ్రీమాన్ రామభద్రాచారియర్ కాలం క్రీ.శ.1840-1904.

సుందరపాలయం ఆకాలంలోపండితులకునిలయం. శ్రీమాన్

ఆచార్యులవారు తమ జన్మస్థలంలోనే విద్యలను అభ్యసించి,

సంప్రదాయ విద్యాభ్యాసంకోసం  శ్రీరంగం వెళ్లినారు.  అక్కడ

'అహోబిలమఠవారి శ్రీమత్ ఆండవాన్ వారి ఆశ్రమం'లో చేరినారు.

శ్రీమత్పెరియాండవాన్ స్వామివారి సన్నిధానంలో

సంప్రదాయసాహిత్యాన్ని అధ్యయనం చేసినారు.శ్రీస్వాముల

వారిసన్నిధానంలోని "అష్టదిగ్గజవిద్వన్మహాకవిపండితవర్యు" లలో 

వీరుకూడా ఒకరుగా  విరాజిల్లినారు.అక్కడ  ఎనిమిది సంవ త్సరాలు 

ఉండి,  ఆతర్వాత "సుందపాలయం" స్వస్థ

లానికి తిరిగి వేంచేసినారు.

శ్రీమాన్ శ్రీరామభద్రాచారియర్ స్వామివారు బహుగ్రంథ

ప్రణేత.వీరు రచించిన గ్రంథాలలో "చిత్రకావ్యం"ఒకటి.

"చిత్రకావ్యమ్"గ్రంథం చెన్నపట్టణంలోని  మైలాపూర్ నుండి  

క్రీ.శ.1892వ  సంవత్సరంలోప్రచురితం

        -:గ్రంథంలోని బంధాల పరిచయం:-

"చిత్రకావ్యమ్" రెండు పరిచ్ఛేదాలుగా విరచితం. ప్రథమ

పరిచ్ఛేదంలో24ప్రకరణాలుఉన్నాయి.ద్వితీయపరిచ్ఛేదంలో

10ప్రకరణాలు ఉన్నవి.

ప్రస్తుతం బంధపరిచయం మాత్రమే చేయాలనుకోవడం

వల్ల ద్వితీయ పరిచ్ఛేదంలోని బంధనామాలను వరుసగా

తెలుసుకుందాం.ద్వితీయ పరిచ్ఛేదంలోని బంధప్రకరణాలు

పదికూడా వరుసగా సంప్రదాయానుసారంగా ఉండడం స్మర

ణీయం.ఇక ఆయా ప్రకరణాలలోని బంధానుక్రమణిక---

                    చిత్రకావ్యమ్ ద్వితీయ పరిచ్ఛేదః

1.పంచాయుధ బంధ ప్రకరణమ్

1.సుదర్శన బంధః

2.శంఖ బంధః

3.గదా బంధః

4.ఖడ్గ బంధః

5.శార్జ్గ బంధః

2.చక్రబంధ ప్రకరణమ్

1.చతురర చక్రబంధః

2.చతురర చక్రబంధః(మరొకటి)

3.విశృంగాటక చక్రబంధః

4.ద్విచతుష్క చక్రబంధః

5.(కవినామవిషయనామాంక)చక్రబంధః

6.గురునామ,కర్తృనామ,విషయనామాంకిత చక్రబంధః

 3.తృతీయం మంత్రప్రకరణమ్

1.ద్వాదశాక్షర గోరథబంధః

2.అష్టాక్షర ఢక్కాబంధః

3.షడక్షర ఉలూఖలబంధః

4.పంచాక్షర భృంగారకబంధః

4.చతుర్థభాగః-ఉపకరణబంధ ప్రకరణమ్

1.చిత్రాందోలికాబంధః

2.సాధారణాందోళికాబంధః

3.సవితాన మంచబంధః

4.సాధారణ మంచబంధః

5.డోలాబంధః

6.సాధారణ ఛత్రబంధః

7.ముక్తాసరచ్ఛత్రబంధః

8.చామరబంధః

9.తాలవృంతబంధః

10.ధ్వజబంధః

11.ముక్తాహారబంధః

5.పంచమం సేనాంగ బంధప్రకరణమ్

1.(సాధారణ)రథబంధః

2.మహారథబంధః

3.గజబంధః

4.తురగబంధః

5.పదాతిబంధః

6.(మరొకటి)పదాతిబంధః

6.షష్టం ఆయుధబంధప్రకరణమ్

1.ఖడ్గబంధః

2.కఠారిబంధః

3.గజబంధః

4.కుంతబంధః

5.పరశుబంధః

6.చాపబంధః

7.శరబంధః

8.ఖేటబంధః

9.క్షురికాబంధః

10.అసిబంధః

7.సప్తమం గోమూత్రికాబంధః

1.(సాధారణ)గోమూత్రికాబంధః

2.సమానవృత్తపాదానులోమప్రతిలోమ గోమూత్రికాబంధః

3.సమానవృత్తపాదానులోమ గోమూత్రికాబంధః

4.భిన్నవృత్తార్థానులోమ గోమూత్రికిబంధః

5.భిన్నవృత్తార్థానులోమ గోమూత్రికాబంధః

6.భిన్నవృత్తపాదానులోమ ప్రతిలోమ గోమూత్రికాబంధః

7.భిన్నవృత్తార్థానంలోమ ప్రతిలోమ గోమూత్రికిబంధః

8.అష్టమం నాగబంధ ప్రకరణమ్

1.కుండలిత ఏకనాగబంధః

2.(సాధారణ)నాగబంధః

3.చతుర్నాగబంధః

4.ద్వినాగబంధః

5.అష్టనాగబంధః

6.కృష్ణసర్పబంధః

7.వాసుకీద్వినాగబంధః

9.నవమం పద్మబంధ ప్రకరణమ్

1.కుముదబంధః

2.పంచదళ పుండరీకబంధః

3.అష్టదళ పద్మబంధః

4.అష్టదళ నీలోత్పలబంధః

5.(కవినామాంకిత)అష్టదళపద్మబంధః

6.మహాష్టదళపద్మబంధః

7.(మరొకరకం)కవినామాంకిత అష్టదళపద్మబంధః

8.కవినామాంకిత అష్టదళపద్మబంధః(రేఖాభేదః)

9.విషయనామాంకిత అష్టదళపద్మబంధః

10.ద్వాదశదళపద్మబంధః

11.షోడశదళపద్మబంధః

12.ద్వాదశదళ నళినీబంధః

13.విలక్షణ చతుర్దళ పద్మబంధః

14.పంచదళ ఉత్పలబంధః

15.షోడశదళకమలబంధః

16.ద్వాత్రింశద్దళ కమలబంధః

 17.స్థలకమలబంధః(మెట్టతామర)             

10.దశమం సంకీర్ణబంధప్రకరణమ్

1.ఊర్ధ్వపుండ్రబంధః

2.ఘంటాబంధః

3.కరకబంధమ్

4.పుష్పహారబంధం

5.పురుషబంధః

6.నారీబంధః

7.హంసబంధః

8.మయూరబంధః

9.మురజబంధః

10.అంగదబంధః

11.గుచ్ఛబంధః

 12.కంఠాభరణబంధః

 13.మత్స్యబబంధః

 14.వృశ్చికబంధః

 15.గోపురబంధః

 16.బృందావనబంధః

 17.అర్ధభ్రమకబంధః

 18.సర్వతోభద్రబంధః

 19.చతురంగే తురంగబంధః

 20.హలబంధః

 21.వీణాబంధః

 22.నిశ్శ్రేణికాబంధః

 23.తులాబంధః

 24.నవవర్షక జంబూద్వీపబంధః

 25.దీపస్తంభబంధః

 26.వృక్షబంధః

 27.ఘటికాబంధః

           -చిత్రకావ్యంలోని మొత్తంబంధాలు-

1.నారాయణస్య పంచాయుధబంధాః    05

2.చక్రబంధాః                                           06

3.మంత్రబంధాః                                      04

4.భోగోపకరణబంధాః                               11

5.సేనాంగబంధాః                                    06 

6.ఆయుధబంధాః                                   10

7.గోమూత్రికాబంధాః                               07    

8.నాగబంధాః                                          07

9.పద్మబంధాః                                         17 

10.సంకీర్ణబంధాః                                   26  

 మొత్తం   ...   ----------     ...                  100

 వందబంధాలు అందమైన సముచిత చిత్రాలతో,

 సందర్భోచితమైన వ్యాఖ్యానంతో,

శ్రీమాన్ శ్రీరామభద్రాచారియర్ స్వామివారు రచించిన చిత్రకావ్యమ్  చదివితే

బంధకవిత్వాభిమానులలో అద్భుతరసాన్ని ఆవిష్కరిస్తుంది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.