గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జులై 2023, శనివారం

శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం - ...18 - 43...//... కృషిగౌరక్ష్యవాణిజ్యం - ...18 - 44,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

జైశ్రీరామ్.

శ్లోశౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్|

దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్. || 18-43 ||

తే.గీశౌర్యమును, తేజమున్ధృతి, జయపిపాస,

యుద్ధమున వెన్ను చూపని  యోధ గుణము,

దానగుణము, సమర్ధత, జ్ఞాన దీప్తి,

దైవలక్షణముల్ క్షాత్ర ధర్మములగు.

భావము.

శౌర్యం, తేజం, పట్టుదల, సమర్ధత, యుద్ధంలో వెన్ను చూపక 

పోవడందానగుణం,  ఈశ్వర లక్షణం---ఇవి స్వభావ సిద్ధమైన క్షత్రియ కర్మలు.

శ్లోకృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్|

పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్. || 18-44 ||

తే.గీకృషియు, గోరక్ష, వాణిజ్య, ధిషణతలిల

వైశ్య కర్మలు సహజమై వరలుచుండు,

భువికి పరిచర్య చేయుట, ముఖ్యవిధిగ

శూద్రులకుఁబుట్టుకనె గల్గు, శూరవరుడ!

భావము.

వ్యవసాయం, గోసంరక్షణ, వాణిజ్యం స్వభావ సిద్ధమైన వైశ్య కర్మలు

పరిచర్య భావంతో కూడినవి శూద్రులకు స్వభావ సిద్ధమైన కర్మలు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.