గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జులై 2023, సోమవారం

అనిత్యాని శరీరాణి, ...మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  అనిత్యాని శరీరాణి, విభవో నైవ శాశ్వతః ౹

నిత్యం సన్నిహితో మృత్యుః, కర్తవ్యో ధర్మ సంగ్రహః ౹౹

కం.  నిత్యంబు కాదు దేహము,

నిత్యంబులు కావయ ధరణిని విభవంబుల్,

మృత్యువు చేరువనుండును,

నిత్యముధర్మార్జనంబు నెరపఁగవలయున్.

భావము.        

మన దేహాలు శాశ్వతము కావు. నాశనం పొందుతాయి. అటులనే 

మన వైభవాలు కూడా శాశ్వతం కావు. చావు ఎపుడు మనకు 

దగ్గరగా ఉంటుంది. కావున ధర్మమును సంగ్రహించుట మన కర్తవ్యము.

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.