గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జులై 2023, ఆదివారం

యత్తదగ్రే విషమివ పరిణామే - ...18 - 37...//... విషయేన్ద్రియ సంయోగాద్య - ...18 - 38,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

 జైశ్రీరామ్

శ్లోయత్తదగ్రే విషమివ పరిణామేऽమృతోపమమ్|

తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమాత్మబుద్ధిప్రసాదజమ్. || 18-37 ||

తే.గీ. తొలుత దుఃఖమయమ్ముగాఁ దోచి సుఖము

కడకుఁ గొల్పునో, శాంతిచే కలుగు మనకు

నట్టి సుఖము సాత్వికమగు నరయపార్థ!

నీవు గ్రహియింపుమియ్యది నేర్పు మీర.

భావము.

సుఖమైతే మొదట విషంగా తోచి, చివరకు ఏది అమృతమగునో, ఏది శాంతించిన 

బుద్ధి వలన లభించునో అది సాత్విక సుఖము.

శ్లోవిషయేన్ద్రియ సంయోగాద్యత్తదగ్రేऽమృతోపమమ్|

పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్. || 18-38 ||

తే.గీకనగ విషయేంద్రియంబుల కలయికవల

మొదటమృతమ్ము, తుదికి విషముగ నగునొ

రాజసికసుఖమది పార్థభూజనులకు

నీవు గ్రహియింపుమా యిది నేర్పు మీర.

భావము.  

విషయాలు ఇంద్రియాలు సంయోగం వలన మొదట అమృతప్రాయంగా ఉండి,

చివరికి విషము వలె అగునది రాజసిక సుఖము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.