గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జులై 2023, శనివారం

డా. దాశరధి కృష్ణమాచార్య పురస్కారం తెలంగాణా ప్రభుత్వం నుండి అందుకొంటున్న డా. అయాచితం నటేశ్వరశర్మ గారు.

జైశ్రీరామ్.
డా. దాశరధి కృష్ణమాచార్య పురస్కారం తెలంగాణా ప్రభుత్వం నుండి అందుకొంటున్న  
డా. అయాచితం నటేశ్వరశర్మ గారు.
బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వరశర్మగారు విద్వత్ కవి, పండితులు. వీరి చేతి వ్రాత అత్యద్భుతంగా ఉండుట విశేషం. వీరి ప్రతిభ అనన్య సామాన్యం. ఈ విషయమును గ్రహించిన తెలంగాణా ప్రభుత్వం సాంస్కృతికశాఖ దాశరధి కృష్ణమాచార్యులవారి జయంతి సందర్భముగా ప్రతిభా పురస్కారంతో గౌరవించడం పండితలోకానికి గర్వకారణం. ఈ సందర్భముగా డా. అయాచితం నటేశ్వరశర్మగారికి నా అభినందనలు తెలియఁజేయుచున్నాను.
ఘనమగు పాండితీ గరిమ గౌరవమొందెను నేడయాచితం
బనెడువరాన్వయుండగు మహాత్ముడు గణ్య నటేశ్వరాఖ్యునిన్
వినయనయాన్వితున్ సభనువిజ్ఞతతోడను గౌరవించుటన్,
మనుత శతాధికంబు ధర మాన్యులయాచిత వంశ వర్ధనుల్.
నటేశ్వరశర్మ మహోదయులకు నా అభినందనవందనములు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.