గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, సెప్టెంబర్ 2022, సోమవారం

ప్రజ- పద్యం (లోకాస్సమస్తాస్సుఖినోభవంతు) వారి “ఆధునిక సామాజిక పద్యనాటక స్పర్ధ”..ంఈ రచనలకు ఆహ్వానం

జైశ్రీరామ్.

 ప్రజ- పద్యం (లోకాస్సమస్తాస్సుఖినోభవంతు) వారి 

 “ఆధునిక సామాజిక పద్యనాటక స్పర్ధ”- 

నియమ నిబంధనలు:

@@బహుమతులు: ప్రథమ – రూ.5000/- ద్వితీయ -రూ 3000/- , తృతీయ – రూ 2000/@@ఆధునిక సామాజిక పద్యనాటక ఇతివృత్తం ఈనాటి సమాజాభ్యుదయానికి తోడ్పడేవిధంగా ఉండాలి. కుల,మత,ప్రాంత,భాషా రాజకీయ విద్వేషాలకు దూరమైన వస్తువులనే స్వీకరించాలి .

@@నాటకం కనీసం మూడు అంకాలకు తక్కువ కాకుండా, అయిదు అంకాలకు మించకుండా ఉండాలి. నాటకంలో అమంగళ,అశ్లీల ,జుగుప్సాకరవిషయాలను సూచ్యంగానే తప్ప వాచ్యంగా ప్రదర్శించడానికి వీల్లేదు

.@@నాటకంలో సంభాషణలు పాత్రౌచితితో ఉండాలి.

@@ప్రతి అంకంలోనూ కనీసం 10 పద్యాలకు తగ్గకుండా, నాటకం మొత్తం మీద 50 పద్యాలకు తగ్గ కుండా ఉండాలి. పద్యాలు సందర్భానికి తగ్గట్టు ఏ ఛందస్సులోనైనా ఉండొచ్చు.ప్రసిద్ధి పొందిన ఛందాలనే వినియో గించుకోవడం ఆహ్వానించదగింది. అలాకానప్పుడు, ఆ విశేష ఛందస్సులక్షణాలను అప్పకవీయంలో పేర్కొన్న విధంగా మాత్రమే తెలపాల్ఉంటుంది.(ద్విపదలు ఇతరాలు కనీసం 4 పాదాలుండాలి.ద్విపదలు,ఇతర రగడ లు. ఉత్కళికలు మొదలైనవి నాటకంలో ఒకసారికి మించి ప్రయోగించరాదు)

@@నాటకం A4 సైజు పేపరు ఒక వైపు ప్రింటులో 50 పేజీలకు మించకుండా ఉండాలి.

@@నాటకంను డిసెంబరు 31 ,2022 లోగా prajapadyam@gmail.com అన్న చిరునామాకి. రచన పూర్తిగా మీ స్వంతం,గతంలో ఎక్కడా ప్రదర్శితం కాలేదన్న హామీ, చరవాణి సంఖ్య, చిరునామా, ఒక పాసుపోర్టు ఫోటో పాటు పంపాల్సి ఉంటూంది. 

@@పోటీకి పంపిన నాటకాల బహుమతి నిర్ణయాలతో పాటు , వాటి తొలి ప్రదర్శనల పూర్తి హక్కు, నాటకంలో అవసరమైన మేరకు మార్పులు చేసుకునే అధికారం ప్రజ-పద్యం వారిదే. ఈ విషయాల్లో ఎలాంటి సంప్రదింపు లకూ , వాదవివాదాలకూ ఆస్కారం లేదు. బహుమతి పొందిన మొదటి మూడు నాటకాలను ప్రజపద్యం ప్రదర్శించే అవకాశం ఉంది. బహుమతి ఫలితాల ప్రకటన తరువాత మాత్రమే రచయితలు తమ పద్య నాటకాలను సొంతంగా ప్రకటించుకోవచ్చు.

ఈ పోటీకి ప్రజపద్యంతో సభ్యులతో పాటు    సమూహాలకు అతీతంగా  కవులు,కవయిత్రులు అందరికీ స్వాగతం.

“పచ్చని పద్యాన్ని ప్రేమిద్దాం

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.