గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

ఇన్ద్రియార్థేషు వైరాగ్య - ...13 - 9...//..... అసక్తిరనభిష్వఙ్గః - , , .13 - 10,,,//...త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

 జైశ్రీరామ్.

|| 13-9 ||

శ్లో. ఇన్ద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ|

జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్.

తే.గీ.  ఇంద్రియార్థమ్ములందున నెప్పటికిని

యహము, వైరాగ్యమున్ లేక, యలరుచుండి

చావుపుట్టుకలప్పుడుభావమునను

దోషముల్ గాంచుటయు ను కలదు తెలియుము.

భావము.

ఇంద్రియ విషయాలలో వైరాగ్యమూ అహంకారము లేకపోవడము , 

పుట్టుకలో, చావులో, ముసలితనంలో, రోగంలో, దుఃఖాన్ని, దోషాన్ని 

నిత్యమూ చూడటమూ,

|| 13-10 ||

శ్లో. అసక్తిరనభిష్వఙ్గః పుత్రదారగృహాదిషు|

నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు.

తే.గీ.  మహిననానాసక్తి, నిర్లిప్తతిహముపైన,

మంచి చెడులందుసమదృష్టి, మదిని గలిగి

యుండునాతండు ఘనుడిలన్ నిండు మదిని

ప్రేమ వారిపై జూపుదు కైషేమమిడుదు.

భావము.

ఆసక్త భావము లేకపోవడము, పుత్రులు-భార్య గృహము మొదలైన వాటితో

తాధాత్మ్యము చెందక పోవడము, ఇష్టాలు ప్రాప్తించినా, ఇష్టం కానిది 

ప్రాప్తించినా మనస్సుని సమస్థితిలో ఉంచుకోవడమూ,

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.