గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, సెప్టెంబర్ 2022, ఆదివారం

తుల్యనిన్దాస్తుతిర్మౌనీ - ...12 - 19...//..... యే తు ధర్మ్యామృతమిదం - , , .12 - 20,,,//... శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు ద్వాదశోధ్యాయః - భక్తియోగః

 జైశ్రీరామ్

 || 12-19 ||

శ్లో.  తుల్యనిన్దాస్తుతిర్మౌనీ సన్తుష్టో యేన కేనచిత్|

అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః.

తే.గీ.  మౌని, స్తుతినిందలొకటిగా మదిగను ఘను

డసమ సంతుష్టు, డనికేతన సరసమతి,

నాకు ప్రీతిపాత్రుడు చూడ, శ్రీకరముగ

వానిలో నేనె మసలుదవారితముగ.

భావము.

నిందాస్తుతులను తుల్యంగా ఎంచేవాడు, మౌనంగా ఉండే వాడు, 

ఉన్నదానితో సంతృప్తి పడేవాడు, నికేతనం అక్కర లేని వాడు, 

స్థిరమైన బుద్ధి కల భక్తుడు నాకు ప్రియుడు.

|| 12-20 ||

శ్లో.  యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే|

శ్రద్దధానా మత్పరమా భక్తాస్తేऽతీవ మే ప్రియాః.

తే.గీ.  ధర్మయుక్త శాశ్వతపు పద్ధతి యిది,

శ్రద్ధతో జేసి నన్మదిన చక్కగగను

నాదుభక్తులన్ బ్రేమింతు మోదమలర,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర. 

భావము.

ధర్మయుక్తమూ, శాశ్వతమూ అయిన దీనిని చెప్పిన ప్రకారంగా శ్రద్ధతో, 

నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఎవరు ఉపాసిస్తారో ఆభక్తులే నాకు పరమ ప్రియులు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయః

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.