గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2022, సోమవారం

అథైతదప్యశక్తోऽసి కర్తుం - ...12 - 11...//.శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్జ్ఞా - , , .12 - 12,,,//... శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు ద్వాదశోధ్యాయః - భక్తియోగః

 జైశ్రీరామ్.

 || 12-11 ||

శ్లో.  అథైతదప్యశక్తోऽసి కర్తుం మద్యోగమాశ్రితః|

సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్.

తే.గీ.  కర్మ నాకొరకిల జేయగా తగవొకొ,

యపుడు కర్మఫలములునా కర్పణమును

చేసి, యన్నిటినిన్ విడు, వాసిగాను,

మంచి ఫలితమున్ పొందేదు మాననీయ.

భావము.

నా కొరకై కర్మలు ఆచరించడానికి కూడా నీవు అసమర్ధడివైతే నన్ను 

శరణు పొంది నీ కోసం చేసే కర్మలన్నింటినీ నాకు సమర్పించి, 

ఆ సమస్త కర్మల ఫలాన్ని త్యజించు.

 || 12-12 ||

శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్జ్ఞానాద్ధ్యానం విశిష్యతే|

ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్.

తే.గీ.  కనగ నభ్యాసమునకు మించు జ్ఞాన మరయ,

జ్ఞాన మునుమించువిడిచిన కర్మ ఫలము,

శాంతి లభియించు, కనుమిది చక్కగాను,

మోక్షమబ్బును. నిజమిది రక్షణదియె.

భావము.

అభ్యాసంకంటే జ్ఞానం మేలు. జ్ఞానానికన్నా కర్మఫల త్యాగం ఎక్కువైనది. 

ఈ త్యాగం వలన తరవాత శాంతి(మోక్షం) కలుగుతుంది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.