గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, సెప్టెంబర్ 2022, గురువారం

యే త్వక్షరమనిర్దేశ్య- ...12 - 5...//.సన్నియమ్యేన్ద్రియగ్రామం- , , .12 - 6,,,//... శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు ద్వాదశోధ్యాయః - భక్తియోగః

 జైశ్రీరామ్.

|| 12-5 ||

శ్లో.  క్లేశోధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్||

అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే.

తే.గీ.  కన నిరాకార బ్రహ్మమున్ గాంచు టరయ

కష్టమౌ దేహధారికి సృష్టిలోన,

నిర్గుణబ్రహ్మ లక్ష్యంబు నియతి నొప్పి

సాధనముచేయుటే కష్ట సాధ్యమరయ.

భావము.

నిరాకార బ్రహ్మలో మనస్సు నిలిపిన వాళ్ళకు ప్రయాస ఎక్కువ. 

దేహధారులకు నిర్గుణ తత్వ లక్ష్యాన్ని అందుకోవడము చాలా కష్టం.

|| 12-6 ||

శ్లో.  యే తు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరః|

అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్త ఉపాసతే.

తే.గీ.  కర్మ ఫలములు నా కిడి, ఘనముగ నను

లక్ష్యముగ కల్గి స్థిరపు సల్లక్షణముల

నొప్పుచుండి యనన్యచిత్తోద్వరగుణ

భాసితుండయి యొప్పుట వరల జేయు.

భావము.

సర్వకర్మలను నాలో వదిలి, నన్నే లక్ష్యముగా పెట్టుకుని మనస్సుని 

అన్య విషయాల వైపు మరలనీయకుండా ధ్యానిస్తూ ఎవరు ఉపాసిస్తారో,

జైహింద్,

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.