గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, సెప్టెంబర్ 2022, గురువారం

ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం - ...13 - 7...//..... అమానిత్వమదమ్భిత్వమహిం - , , .13 - 8,,,//...త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

 జైశ్రీరామ్

| 13-7 ||

శ్లో.  ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః|

ఏతత్క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్.

తే.గీ.  ద్వేష,  దుఃఖ, సుఖేచ్ఛలున్, వినగ దేహ

మును, సుచేతనత్వము, మరి ఘనతరమగు  

పట్టుదలయును క్షేత్రమై పరగు పార్థ!

నీవు గ్రహియింపగలవిది నేర్పు మీర.

భావము.

ఇచ్చ, ద్వేషం, సుఖము, దుఃఖము, శరీరము, చేతనత్వము, పట్టుదల 

ఇవి వికారాలతో కూడిన క్షేత్రం అని సంగ్రహంగా చెప్పడమైంది.

|| 13-8 ||

శ్లో. అమానిత్వమదమ్భిత్వమహింసా క్షాన్తిరార్జవమ్|

ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః.

తే.గీ.  స్థైర్య, శౌచ, మమానిత్వ, ధర్మనిరతి,

యాత్మనిగ్రహమదంబత్వ, మనుపమగురు

సేవ, యోర్మియు, నొప్పుచు జీవనమును

సాగజేయుట మహితము సత్ ప్రభాస.

భావము.

తనని తాను పొగడక పోవడం, ఢంభము లేకుండా ఉండడమూ, అహింసా, 

ఓర్పూ, నిజాయితీ, గురు శుశ్రూష, శుచిత్వమూ, స్తిరత్వమూ, 

ఆత్మనిగ్రహమూ.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.