గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, సెప్టెంబర్ 2022, శనివారం

తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ- ...11 - 37...//.ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ- , , .11 - 38,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

 జైశ్రీరామ్.

|| 11-37 ||

శ్లో.  కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్

గరీయసే బ్రహ్మణోऽప్యాదికర్త్రే|

అనన్త దేవేశ జగన్నివాస

త్వమక్షరం సదసత్తత్పరం యత్.

తే.గీ. శ్రేష్టుడవు, బ్రహ్మతాతవు, జీవకోటి

మోకరిల్లకెట్లుండును? మూలమయిన

యక్షరుండవు శ్రీకృష్ణ?యమరవినుత! 

నిన్ను మించిన సృష్టి యేమున్నదయ్య.

భావము.

ఓమహాత్మా! నీవు సర్వశ్రేష్ఠుడవు. సృష్టికర్తయైన బ్రహ్మకే 

మూలకారకుడవు - కనుక వారు (సిద్దాదులందఱును) నీకు 

నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంతా! ఓ దేవేశా! 

ఓ జగన్నివాసా! సత్-అసత్లు నీవే. వాటికంటెను పరమైన 

అక్షరస్వరూపుడవు అనగా సచ్చిదానందఘనపరబ్రహ్మవు నీవే.

|| 11-38 ||

శ్లో.  త్వమాదిదేవః పురుషః పురాణస్-

త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|

వేత్తాసి వేద్యం చ పరం చ ధామ

త్వయా తతం విశ్వమనన్తరూప

తే.గీ.  ఆదిదేవుండవేనీవనంతరూప!

హరి! సనాతనుడవు పరమాశ్రయుడవు,

సర్వమెరిగినట్టి సకలపతివి,

జగతికాశ్రయుండవు నీవు నిగమవేద్య!

భావము.

ఓ అనంతరూపా! నీవు ఆదిదేవుడవు, సనాతనపురుషుడవు, 

ఈజగత్తునకు పరమాశ్రయుడవు. సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు. 

ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమైయున్నది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.