గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, సెప్టెంబర్ 2022, గురువారం

ఇతి క్షేత్రం తథా జ్ఞానం - ...13 - 19...//..... ప్రకృతిం పురుషం చైవ - , , .13 - 20,,,//...త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

 జైశ్రీరామ్

|| 13-19 ||

శ్లో. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః|

మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే.

తే.గీ.  క్షేత్ర, సుజ్ఞాన, సుజ్ఞేయ పాత్రలెరుగ

తెలిపితిని, నాదు భక్తులు తెలిసికొనుచు

నన్ను పొందుదు రర్జునా! సన్నుతముగ.

నీవు గ్రహియింపుమియ్యది నేర్పు మీర.

భావము.

క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయం సంగ్రహంగా చెప్పబడినాయి. నా భక్తుడు 

దీనిని తెలుసుకొని నాభావాన్ని(మోక్షాన్ని) పొందుతాడు.

|| 13-20 ||

శ్లో. ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి|

వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసమ్భవాన్.

తే.గీ.  ప్రకృతిపురుషులనాథులు, ప్రకృతి నుండి 

గుణ వికారాదులొదవెను ఘనతరముగ

వాటివలననె యీసృష్టి మేటిగాను

సాగుచుండెనో యర్జునా! సతతమిటుల.

భావము.

ప్రకృతి పురుషులిద్దరూ అనాది అని తెలుసుకో. వికారాలూ, గుణాలూ 

ప్రకృతి నుండి పుట్టాయని తెలుసుకో.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.