గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, సెప్టెంబర్ 2022, సోమవారం

ప్రకృతిం పురుషం చైవ - ...13 - 1...//..... ఇదం శరీరం కౌన్తేయ - , , .13 - 2,,,//...త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

జైశ్రీరామ్.

త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

అర్జున ఉవాచ|

భావము.

అర్జునుడు అనుచున్నాడు.

|| 13-1 ||

శ్లో.  ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ|

ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ.

తే.గీ. ప్రకృతి, పురుషుడు క్షేత్రంబు పరగుచున్న

మహిత క్షేత్రజ్ఞులను గూర్చి మహిమ తలర

కేశవా తెల్పు తెలియగ క్షేమమలర

తెలియ గోరుచునుంటిని దీపితముగ.

భావము.

ఓ కేశవా! ప్రకృతియననేమి? పురుషుడెవ్వడు? క్షేత్రమనగానేమి? 

క్షేత్రజ్ఞుడెవ్వడు? జ్ఞానమనగానేమి? జ్ఞేయస్వరూపమెట్టిది? వీటిని గూర్చి 

తెలియగోరుచున్నాను.

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ భగవాను డిట్లనియెను.

|| 13-2 ||

శ్లో.  ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిధీయతే|

ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః.

తే.గీ. క్షేత్రమున్ దేహమనుచును, క్షేత్రధర్మ

మెరుగునాతడె క్షేత్రజ్ఞు డరయననుచు

తెలిసినట్టి సద్విజ్ఞులు తెలుపుదురయ,

తెలియుమర్జునా యిది నీవు తెలివి కనుమ.

భావము.

ఓ అర్జునా! ఈ దేహము క్షేత్రమని చెప్పబడుచున్నది. ఈ క్షేత్ర ధర్మము 

నెవడెరుంగునో వానిని క్షేత్రజ్ఞుడని ఈ విషయమును తెలిసినవారు చెప్పుదురు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.