గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, సెప్టెంబర్ 2022, ఆదివారం

మయి చానన్యయోగేన - ...13 - 11...//..... అధ్యాత్మజ్ఞాననిత్యత్వం - , , .13 - 12,,,//...త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

 జైశ్రీరామ్

 || 13-11 ||

శ్లో. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ|

వివిక్తదేశసేవిత్వమరతిర్జనసంసది.

తే.గీ.  వ్యభిచారహీనపుభక్తి  ననుపమముగ

లస దనన్యయోగమున నన్నసమరీతి

గొలుచుచేకాంతముగ నుండు సలలితుడిల

నాదు ప్రీతికి పాత్రుండు, నయనిధాన!

భావము.

ఇంకా, నాలోఅనన్య యోగంతో ఉండే వ్యభిచరించని భక్తీ, ఏకాంతంలో 

గడపడమూ, జనసమర్ధంలో అభిరుచి లేకపోవడమూ,

 || 13-12 ||

శ్లో. అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్|

ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా.

తే.గీ.  నిత్యమాధ్యాత్మికజ్ఞాన నిరతి, తత్వ

కలిత సుజ్ఞాన లక్ష్యమున్ గాంచుటయును

జ్ఞాన మనబడున్, కాని వజ్ఞానమనబ

డును గ్రహింపుమో పార్థ! నేడనుపమముగ.

భావము.

నిత్యమూ ఆధ్యాత్మ జ్ఞానము ఉండడమూ, తత్వ జ్ఞానము యొక్క లక్ష్యాన్ని 

దర్శించడము జ్ఞానమని చెప్పబడింది. దానికి భిన్నమైనది అంతా 

అజ్ఞానము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.