గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, సెప్టెంబర్ 2022, శుక్రవారం

యో న హృష్యతి న ద్వేష్టి - ...12 - 17...//..... సమః శత్రౌ చ మిత్రే చ - , , .12 - 18,,,//... శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు ద్వాదశోధ్యాయః - భక్తియోగః

 జైశ్రీరామ్.

 || 12-17 ||

శ్లో.  యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాఙ్క్షతి|

శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యః స మే ప్రియః.

తే.గీ.  దుఃఖ సంతోషహీనుడు, దురితదూరు

డసమ శోకదూరుడు కాంక్ష లరయ లేని

యశుభ శుభములు లేని యా యతంలితుడన

నాకుప్రీతుడీవెరుగుము నయపిధాన.

భావము.

ఎవడు సంతోషించడో, ద్వేషించడో, శోకించడో, కాంక్షించడో

సుభాశుభాలను వదిలేస్తాడో అలాంటి భక్తుడు నాకు ప్రియుడు.

 || 12-18 ||

శ్లో.  సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః|

శీతోష్ణసుఖదుఃఖేషు సమః సఙ్గవివర్జితః.

తే.గీ. అరయ శీతోష్ణ సుఖ దుఃఖ విరహితుండె

వ డిల మానావమాన దూరుడును సంఖ

రహితుడయియుండుధహనో యట్టి రమ్య గుణుడు

నాకునిష్టుండు కనుమిది శ్రీకరముఖ.

భావము.

శత్రువులు, మిత్రులు, మానావమానాలు, శీతోష్ణాలు, సుఖదుఃఖాలు 

వీటియందు సమంగా ఉండే వాడు సంగాన్ని విడిచే వాడు(నాకు ఇష్టుడు).

జైహైంద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.