గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, సెప్టెంబర్ 2022, గురువారం

తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ- ...11 - 35...//.ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ- , , .11 - 36,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

జైశ్రీరామ్.

సఞ్జయ ఉవాచ|

భావము.

సంజయుడు పలికెను:

|| 11-35 ||

శ్లో.  ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య

కృతాఞ్జలిర్వేపమానః కిరీటీ|

నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం

సగద్గదం భీతభీతః ప్రణమ్య.

తే.గీ.  అచ్యుతునిమాట విన్నట్టి యర్జునుండు

భీతి వణుకుచు జోడించి చేతుల నట

వర్ణనము చేయసాగె నాపన్నరక్షు.

మరల ప్రణతులు చేసెనా నరుడు హరికి.

భావము.

ఓ రాజా! శ్రీ కృష్ణపరమాత్మ యొక్క ఈ మాటలను విని, అర్జునుడు 

వణకుచు,చేతులు జోడించి నమస్కరించెను. మఱల మిక్కిలి 

భయముతో ప్రణమిల్లి, గద్గదస్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని 

స్తుతింపసాగెను.

అర్జున ఉవాచ.

భావము.

అర్జునుడు పలికెను

|| 11-36 ||

శ్లో.  స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా

జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ|

రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి

సర్వే నమస్యన్తి చ సిద్ధసఙ్ఘాః.

తేగీ. నిను గని జగము ముదమున ఘనతపొగడ

రాక్షసుల్ భయముననుపారదొడగను

సిద్ధగణములు ప్రణమిల్లచిత్తమలర,

చూచిధర్మమంచెంచితి శుభద కృష్ణ.

భావము.

ఓ అంతర్యామి! కేశవా! నీ నామగుణ ప్రభావములను కీర్తించుచు 

జగత్తు హర్షాతిరేకముతో, అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. 

ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును 

పారిపోవుచున్నారు. సిద్దగణములవారెల్లరును ప్రణమిల్లుచున్నారు.

జైహింద్,

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.