గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, సెప్టెంబర్ 2022, బుధవారం

యే త్వక్షరమనిర్దేశ్య- ...12 - 3...//.సన్నియమ్యేన్ద్రియగ్రామం- , , .12 - 4,,,//... శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు ద్వాదశోధ్యాయః - భక్తియోగః

 జైశ్రీరామ్.

 || 12-3 ||

శ్లో. యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే|

సర్వత్రగమచిన్త్యఞ్చ కూటస్థమచలన్ధ్రువమ్.

తే.గీ.  వర జితేంద్రియుల్, సకలమౌ ప్రాణులకును

హితమునే కోరువారును, క్షితిని ప్రాణు

లను సమముగ జూచుసదయుల్ ఘనతనొప్పు

యోగులని చెప్పుకొనుటయే యుక్త మగును.

భావము.

కాని ఇంద్రియసముదాయమును చక్కగా వశపరచుకొనినవారును, 

సకల భూతములకును హితమునే కోరుచుండువారును, 

సర్వప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు.

|| 12-4 ||

శ్లో.  సన్నియమ్యేన్ద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః|

తే ప్రాప్నువన్తి మామేవ  సర్వభూతహితే రతాః.

తే.గీ.  మంచిపైనింద్రియమ్ములన్ మలచు వారు,

నంతటన్ సమ దృష్టితో నలరువారు,

సర్వ భూతహితులు, నుర్వి గర్వహీను

లగుటచే నన్ను జేరెద రనుపమముగ.

భావము.

అట్టివారు మనోబుద్దులకు అతీతుడును, సర్వవ్యాపియు, 

అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును, కూటస్థుడును, 

నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారుడును, నాశరహితుడును 

ఐన సచ్చిదానంద ఘనపరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావస్థితులై, 

ధ్యానము చేయుచు, భక్తితో భజించుచు, ఆ పరబ్రహ్మమునే పొందుదురు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.