గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, సెప్టెంబర్ 2022, బుధవారం

అవిభక్తం చ భూతేషు - ...13 - 17...//..... జ్యోతిషామపి తజ్జ్యోతి - , , .13 - 18,,,//...త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

జైశ్రీరామ్

|| 13-17 ||

శ్లో. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్|

భూతభర్తృ చ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ.

తే.గీ.  బ్రహ్మమొక్కటే, జీవులన్ బరిగణింప

వేరువేరుగాతోచీను, విశ్వ భార

మంతమ్రోయుచు సృష్టిని సాంతభదియె

పుట్టజెయును జంపును పట్టిపట్టి.

భావము.

ఆ పరబ్రహ్మము విభాగములు లేనిదైనా, జీవులలో విభజింపబడి 

నట్లుగానూ,  జీవులను భరించేది, సృష్టి సంహారాలను చేసేదిగా 

తెలియాలి.

|| 13-18 ||

శ్లో. జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే|

జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్.

తె.గీ.  వెలుగులకువెలుగది చూడ, విశ్వమునను,

చీకటికినావలుండును లోకమునను,

జ్ఞాన మును  జ్ఞేయమదియెన్న, కడకు చూడ

జ్ఞాన గమ్యంబు సిద్ధియు గాంచ నదియె.

భావము.

వెలుగలకు వెలుగది. (అజ్ఞానమనే)చీకటికి ఆవల ఉన్నదని 

చెప్పబడుతుంది. అదే జ్ఞానమూ, జ్ఞేయమూ, జ్ఞాన గమ్యమూ 

అందరి హృదయాలలో 

సిద్ధించి ఉన్నది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.