గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మే 2018, సోమవారం

త్రినేత్ర,మోహినీ,నయ,సన్నిజాసని,వెలపెంచు,కలుముల,కలతల,నెలతా, జలజా,కలిదోషారి,గర్భ-"కలితయశ"-వృత్తము.రచన:-శ్రీ వల్లభవజల అష్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.

త్రినేత్ర,మోహినీ,నయ,సన్నిజాసని,వెలపెంచు,కలుముల,కలతల,నెలతా,
జలజా,కలిదోషారి,గర్భ-"కలితయశ"-వృత్తము.రచన:-శ్రీ వల్లభవజల అష్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

కలితయశ వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.జ.స.న.భ.న.న.లల.గణములు.యతులు.10,18.
వృ.సం.33289480.ప్రాసనీమముగలదు.
కలికి చిలుకల కొల్కి!కలకంఠి యలివేణి!కలుము లలరు నెలత!
కలత లెడమును జేసి!కలి దోషములు బాపి!లలిత యశము బొడమ!
విలువగు శుభగతాన!వెల పెంచి మము గావ!పిలువగ దరినిలిచి!
జలజ నయన గాచు!చలి యించి హరి వెంట!చలువ నొసగు భవిత!

1.గర్భగత"-త్రినేత్ర"-వృత్తము.
బృహతీఛందము.న.న.జ.గణములు.వృ.సం.384.ప్రాసగలదు.
కలికి చిలుకల కొల్కి!
కలత లెడము జేసి!
విలువగు శుభగతాన!
జలజ నయన గాచు!

2.గర్భగత"-మోహినీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.న.గల.గణములు.వృ.సం.188.ప్రాసగలదు.
కలకంఠి యలివేణి!
కలి దోషములు బాపి!
వెల పెంచి మముగావ!
చలియించి హరి వెంట!

3.గర్భగత"-నయ"-వృత్తము.
బృహతీఛందము.న.న.న.గణములు.వృ.సం.512.ప్రాసగలదు.
కలుము లలరు నెలత!
కలిత యశము బొడమ!
పిలువగ దరి నిలిచి!
చలువ నొసగు భవిత!

4.గర్భగత"-సన్నిజాసని"-వృత్తము.
అతయష్టీఛందము.న.న.జ.స.న.గల.గణములు.యతి.10,వయక్షరము.
వృ.సం.96128.ప్రాసనీమముగలదు. 
కలికి చిలుకల కొల్కి!కలకంఠి యలి వేణి!
కలత లెడమును జేసి!కలి దోషములు బాపి?
విలువగు శుభ గతాన!వెల పెంచి మముగావ?
జలజ నయన గాచు!చలియించి హరి వెంట?

5.గర్భగత"-వెలపెంచు"-వృత్తము.
అత్యష్టీఛందము.స.న.భ.న.న.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
వృ.సం.131004.ప్రాసనీమముగలదు.
కలకంఠి యలివేణి!కలుము లలరు నెలత!
కలి దోషములు బాపి!కలిత యశము బొడమ!
వెల పెంచి మముగావ!పిలువగ దరి నిలిచి!
చలియించి హరి వెంట!చలువనొసగు భవిత!

6.గర్భగత"-కలుముల"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.భ.న.న.న.న.న.గల.గణములు.యతులు.9,18.
వృ.సం.49826880.ప్రాసనీమముగలదు.
కలకంఠి యలివేణి!కలుము లలరు నెలత!కలికి చిలుకుల కొల్కి!
కలి దోషములు బాపి!కలిత యశము బొడమ!కలతలెడము జేసి!
వెల పెంచి మము గావ!పిలువగ దరి నిలిచి!విలువగు శుభ గతాన!
చలియించి హరి వెంట!చలువ నొసగు భవిత!జలజ నయన గాచు!

7.గర్భగత"-కలతల"-వృత్తము.
ధృతిఛందము.న.న.న.న.న.జ.గణములు.వృ.సం.1966608.
యతి.10.వ.యక్షరము.ప్రాసనీమముగలదు
కలుము లలరు నెలత కలికి చిలుకల కొల్కి?
కలిత యశము బొడమ !కలత లెడము జేసి?
పిలువగ దరి నిలిచి!విలువగు శుభగతాన!
చలువ నొసగు భవిత!జలజ నయన గాచు!

8.గర్భగత"-నెలతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.న.న.న.జ.స.న.గల.గణములు.యతులు.10,19.
వృ.సం.50412936.ప్రాసనీమముగలదు.
కలుము లలరు నెలత!కలికి చిలుకల కొల్కి!కలకంఠి యలివేణి!
కలిత యశము బొడమ!కలత లెడము జేసి!కలి దోషములు బాపి!
పిలువగ దరి నిలిచి!విలువగు శుభగతాన!వెలపెంచి మముగావ!
చలువ నొసగు భవిత!జలజ నయన గాచు!చలియించి హరి వెంట!

9.గర్భగత"-జలజా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.న.భ.న.న.గల.గణములు.యతి.9.వయక్షరము.
వృ.సం.98256.ప్రాసనీమముగలదు.
కలకంఠి యలివేణి!కలికి చిలుకల కొల్కి!
కలి దోషములు బాపి!కలత లెడము జేసి!
వెల పెంచి మము గావ!విలువగు శుభగతాన!
చలియించి హరి వెంట!జలజ నయన గాచు!

10,గర్భగత"కలిదోషషారి"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.భ.న.న.భ.న.న.లల.గణములుయతులు.9,18.
వృ.సం.666369728.ప్రాసనీమముగలదు.
కలకంఠి యలివేణి!కలకి చిలుకల కొల్కి!కలుము లలరు నెలత!
కలి దోషములు బాపి!కలత లెడము జేసి!కలిత యశము బొడమ!
వెల పెంచి మముగావ!విలువగు శుభగతాన!పిలువగ దరి నిలిచి!
చలియించి హరి వెంట !జలజ నయన గాచు!చలువ నొసగు భవిత!
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కలకంఠి యలివేణి
కలి దోషములు బాపి
అన్ని వృత్తములలోను అలరించు చున్నవి.కవి శ్రేష్టులకు శత వందనములు. శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.