గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మే 2018, శనివారం

మత్తరజినీ,పరనిందా,చెడుతీరు,నీటితీరు,భాసురతర,భాస్వతర,నిల్చునా,మరయా,గాడిచెడు,కన్నారే,గర్భ"-పన్నాలవల్లె"-వృత్తము.రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
మత్తరజినీ,పరనిందా,చెడుతీరు,నీటితీరు,భాసురతర,భాస్వతర,నిల్చునా,మరయా,గాడిచెడు,కన్నారే,గర్భ"-పన్నాలవల్లె"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
-"పన్నాలవల్లె"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.భ.స.ర.త.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ఎండమావి నీటి తీరయెం?ఏడు పదుల స్వాతంత్ర్యమే?యెన్నాళ్ళునిల్చు నందువే!
కొండ కోన లెల్ల మాసెనే?గోడు పడుచు స్వార్ధంబునం! కొన్నాళ్ళె నిల్చు నీ సిరుల్!
గండు మీలు మ్రింగు చుండగా!గాడి పడని సామ్యంబునం!కన్నారె?యిట్టి. దుస్థితిన్?
బండలాయె భావి భాగ్యముల్!పాడుపడెను స్వేచ్ఛింతలో!పన్నాలు తీరు నెంచకన్?
                                                                                       

1.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
ఎండమావి నీటి తీరయెన్?
కొండ కోన  లెల్ల   మాసెనే?
గండు మీలు మ్రింగు చుండగా!
బండలాయె భావి భాగ్యముల్!

2.గర్భగత"-పరనిందా"-వృత్తము
బృహతీఛందము.భ.స.ర.వృ.సం.159.ప్రాసగలదు
ఏడు పదుల స్వాతంత్ర్యమే!
గోడు పడుచు స్వార్ధంబునన్?
గాడి పడని సామ్యంబునన్?
పాడు పడెను స్వేచ్ఛింతలో?

3.గర్భగత"-చెడు తీరు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.మ.ర.లగ.గణములు.81.ప్రాసనీమము గలదు.
ఎన్నాళ్ళు  నిల్చు నందువే?
కొన్నాళ్ళె  నిల్చు నీసిరుల్!
కన్నారె యిట్టి దుస్థితిన్?
పన్నాలు తీరు నెంచకన్?

4.గర్భగత"-నీతి తీరు"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.భ.స.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఎండమావి నీటి తీరయెం?ఏడు పదుల స్వాతంత్ర్యమే?
కొండ కోన లెల్ల మాసెనే! గోడు పడుచు స్వార్ధంబునన్?
గండు మీలు మ్రింగు చుండగా!గాడి పడని సామ్యంబునన్?
బండలాయె భావి భాగ్యముల్!పాడుపడెనుస్వేచ్ఛింతలో?

5.గర్భగత"-భాసుర తర"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.ర.త.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఏడు పదుల స్వాతంత్ర్యమే! ఎన్నాళ్ళు నిల్చు నందువే?
గోడు పడుచు స్వార్ధంబునం!కొన్నాళ్ళె నిల్చు నీసిరుల్?
గాడి పడని సామ్యంబునం!కన్నారె?యిట్టి దుస్థితిన్?
పాడు పడెను స్వేచ్ఛింతలో!పన్నాలు తీరు నెంచకన్?

6.గర్భగత"-భాస్వతర"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.ర.త.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
ఏడు పదుల స్వాతంత్ర్యమే!ఎన్నాళ్ళు నిల్చు నందువే?ఎండమావి నీటి తీరయెన్?
గోడు పడుచు స్వార్ధంబునం!కొన్నాళ్ళె నిల్చు నీ సిరుల్?కొండ కోన లెల్ల మాసెనే!
గాడి పడని సామ్యంబునం!కన్నారె యిట్టి దుస్థితిం?గండు మీలు మ్రింగు చుండగా!
పాడు పడెను స్వేచ్ఛింతలో! పన్నాలు తీరు నెంచకం?బండలాయె భావి భాగ్యముల్!

7.గర్భగత"-నిల్చునా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.ర.య.జ.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమము గలదు.
ఎన్నాళ్ళు నిల్చు నందువే?ఎండమావి నీటి తీరయెన్?
కొన్నాళ్ళె నిల్చు నీ సిరుల్?కొండ కోన లెల్ల మాసెనే!
కన్నారె యిట్టి దుస్థితిం?గండు మీలు మ్రింగు చుండగా!
పన్నాలు తీరు నెంచకం?బండలాయెభావవి భాగ్యముల్!

8.గర్భగత"-మారయా"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.ర.య.జ.ర.య.న.య.లగ.గణములు.యతులు.9,18.ప్రాసనీమముగలదు.
ఎన్నాళ్ళు నిల్చు నందువే?ఎండమావి నీటి తీరయెం?ఏడు పదుల స్వాతంత్ర్యమే!
కొన్నాళ్ళె నిల్చు నీ సిరుల్?కొండ కోన లెల్ల మాసెనే!గోడు పడుచు స్వార్ధంబునన్!
కన్నారె యిట్టి దుస్థితిం?గండు మీలు మ్రింగు చుండగా!గాడి పడని సామ్యంబునన్!
పన్నాలు తీరు నెంచకం?బండలాయె భావి భాగ్యముల్!పాడు పడెను స్వేచ్ఛింతలో!

9.గర్భగత"-గాడిచెడు"-ధృతిఛందము.
ధృతిఛందము.భ.స.ర.ర.జ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఏడు పదుల స్వాతంత్ర్యమే!ఎండమావి నీటి తీరయెం?
గోడు పడుచు స్వార్థంబునం!కొండ కోన లెల్ల మాసెనే!
గాడి పడని సామ్యంబునం!గండు మీలు మ్రింగు చుండగా!
పాడుపడెను స్వేచ్ఛింతలో!బండ లాయె భావి భాగ్యముల్!

10.గర్భగత"-కన్నారే"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.ర.ర.జ.ర.త.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ఏడు పదుల స్వాతంత్ర్యమే!ఎండమావి నీటి తీరయెం?ఎన్నాళ్ళు నిల్చు నందువే?
గోడు పడుచు స్వార్థంబునం!కొండ కోన లెల్ల మాసెనే!కొన్నాళ్ళె నిల్చు నీ సిరుల్!
గాడి పడని సామ్యంబునం!గండుమీలు మ్రింగు చుండగా! కన్నారె యిట్టి దుస్థితిన్?
పాడుపడెను స్వేచ్ఛింతలో!బండలాయె భావి భాగ్యముల్!పన్నాలు తీరు నెంచకన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.   
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఎండమావి నీటి తీరయెన్ ....కొండ కోనలెల్ల మాసెనె "
ఏడు పదుల స్వాతంత్ర్యమే ఎన్నాళ్ళు నిల్చు నందువే ? వేరు వేరు వృత్తములలో అద్భుతముగా నున్నవి. శ్రీ వల్లభవఝుల వారికి శత వందనములు. శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఎండమావి నీటి తీరయెన్
బండలాయె భావి భాగ్యముల్ "
చాలా బాగుంది. అన్నిపద్యములూ వాస్త వానికి అద్దంపట్టినవి . సరస్వతీ పుత్రులు తప్ప ఎవరు వ్రాయగలరు ? ధన్య వాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.