గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, మే 2018, ఆదివారం

నిందాశ్రి,మత్తరజినీ,సమాశ్రీ,నీతివినా,వసుగంధి,నిందాపూర్ణ,రజ రయతా, రానిది,నీతీనిలని,దరిరాని,గర్భ -"వెన్నాడని"-వృత్తము. రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.

నిందాశ్రి,మత్తరజినీ,సమాశ్రీ,నీతివినా,వసుగంధి,నిందాపూర్ణ,రజ రయతా,
రానిది,నీతీనిలని,దరిరాని,గర్భ -"వెన్నాడని"-వృత్తము.
రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-వెన్నాడని"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.త.ర.ర .జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమభుగలదు.
నింద లేందే?బొందె పోవునా?నేరగాళ్ళు నీతి నిల్తురే?నీదనేది రాదు వెంట!
మందు లేందే?రోగమాగునా!మారణంబ దాగి తీరునే?మాదకాలు!దోషమోపు!
బందు లేందే?కార్య సాధ్యమా?భారయిత్వ బాధ బీదకే?వాదుమాని!నీతి  మెల్గుమా!
చిందు లేందే? నాట్యమౌనొకో?చేరుకొందు రెట్లు?మోక్షముం! శ్రీధరుం దలంచుమోయి!

1.గర్భగత"నిందాశ్రి"-వృత్తము.
బృహతీఛందము.ర.త.ర.గణములు.వృ.సం.163.ప్రాసగలదు.
నింద లేందే? బొందె  పోవునా?
మందు లేందే?బొందె పోవునా!
బంధు లేందే?కార్య సాధ్యమా?
చిందు లేందే?నాట్య మౌనొకో!

2.గర్భగత"-మత్తరజినీ"వవృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములువృ.సం.171.ప్రాసగలదు.
నేరగాళ్ళు నీతి నిల్తురే?
మారణంబ దాగి తీరునే?
భారయిత్వ బాధ బీదకే?
చేరు కొందు రెట్లు? మోక్షమున్?

3.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు
నీదనేది రాదు వెంట!
మాదకాలు దోషమోపు!
వాదు మాని నీతిమెల్గు?
శ్రీధరుం దలంచు మోయి!

4.గర్భగత"-నీతివినా"-వృత్తము.
ధృతిఛందము.ర.త.ర.ర.జ.రగణములు.యతి.10,వయక్షరము.
ప్రాసనీమముగలదు.
నింద లేందే? బొందె పోవునా!నేరగాళ్ళు నీతి నిల్తురే?
మందు లేందే?రోగ మాగునా!మారణంబు దాగి తీరునే?
బంధు లేందే?కార్య సాధ్యమా!భారయిత్వ బాధ బీదకే?
చిందు లేందే?నాట్య మౌనొకో?చేరుకొందు రెట్లు?మోక్షమున్!

5.గర్భగత"-వసుగంధి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము
ప్రాసనీమముగలదు.
నేరగాళ్ళు నీతి నిల్తురే?నీదనేది రాదు వెంట!
మారణంబుదాగి తీరునే?మాదకాలు దోషమోపు!
భారయిత్వ బాధ బీదకే?వాదు మాని నీతి మెల్గు?
చేరుకొందు రెట్లు?మోక్షముం!శ్రీధరుం దలంచు మోయి!

6.గర్భగత"-నిందాపూర్ణ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.య.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
నేరగాళ్ళు నీతి నిల్తురే?నీదనేది రాదు వెంట!నిందలలేందే?బొందె పోవునా?
మారణంబుదాగి తీరునే?మాదకాలు దోషమోపు!మందు లేందే?  రోగ మాగునా!
భారయిత్వ బాధ బీదకే?వాదు మాని నీతి మెల్గు!బంధు లేందే? కార్య సాధ్యమా!
చేరుకొందు రెట్లు?మోక్షముం!శ్రీధరుం దలంచుమోయి!చిందు లేందే?నాట్య మౌ నెటుల్?

7.గర్భగత"-రజ రయరా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.య.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నీదనేది రాదు వెంట!నింద లేందే?బొందె పోవునా?
మాదకాలు దోషమోపు!మందు లేందే?రోగ మాగునా?
వాదుమాని నీతి మెల్గు!బంధు లేందే?కార్య సాధ్యమా?
శ్రీధరుం దలంచు మోయి!చిందు లేందే!నాట్య మౌనెటుల్?

8.గర్భగత"-రానిది"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.య.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
నీదనేది రాదు వెంట!నింద లేందే?బొందె పోవునా?నేరగాళ్ళు నీతి నిల్తురే?
మాదకాలు దోషమోపు!మందు లేందే? రోగ మాగునా?మారణంబు దాగి తీరునే?
వాదు మాని నీతి మెల్గు!బంధు లేందే!కార్య సాధ్యమా?భారయిత్వ బాధ బీదకే?
శ్రీధరుం దలంచు మోయి!చిందు లేందే?నాట్యమౌనే? చేరుకొందు రెట్లు? మోక్షం?

9.గర్భగత"-నీతి నిలని"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.త.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నేరగాళ్ళు నీతి నిల్తురే?నింద లేందే?బొందె పోవునా?
మారణంబు దాగి తీరునే?మందు లేందే?రోగ మాగునా?
భారయిత్వ బాధ బీదకే?బంధు లేందే?కార్య సాధ్యమా?
చేరు కొందు రెట్లు?మోక్షముం?చిందు లేందే?నాట్య మౌనే?

10.గర్భగత"-దరిరాని"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.త.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
నేరగాళ్ళు నీతి నిల్తురే?నింద లేందే?బొందె పోవునా?నీదనేది  రాదు వెంట!
మారణంబు దాగి తీరునే?మందు లేందే?రోగ మాగునా?మాదకాలు దోష మోపు!
భారయిత్వ బాధ బీదకే?బంధు లేందే?కార్య సాధ్యమా?వాదు మాని నీతి మెల్గు!
చేరు కొందు రెట్లు?మోక్షముం?చిందు లేందే?నాట్య మౌనే?శ్రీధరుం దలంచు మోయి!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
" నింద లేందే బొందె పోవునా ?
మందు లేందే బొందె పోవునా ? అద్భుతముగా నున్నవి. పండిత శ్రేష్టులకు ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.