గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, మే 2018, ఆదివారం

మత్తరజినీద్వయ,సమాశ్రీ,రజోరంజిత,యతిర్నవ సుగంధిద్వయ,కొంగుబంగరుద్వయ,రజనీకరప్రియ,కల్పద్రుమ,గర్భ"-గిరివరదమ"-వృత్తము.రచన:-శ్రీవల్లభవఝుల అప్పల నరసింహ మూర్తి.

 జైశ్రీరామ్.
మత్తరజినీద్వయ,సమాశ్రీ,రజోరంజిత,యతిర్నవ సుగంధిద్వయ,కొంగుబంగరుద్వయ,రజనీకరప్రియ,కల్పద్రుమ,గర్భ"-గిరివరదమ"-వృత్తము.
రచన:-వల్లభవఝుల అప్పల నరసింహ మూర్తి.
  జుత్తాడ.

           -"గిరివరదమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.రజ.ర.లగ.గణములు.యతులు.10,18,
ప్రాసనీమముగలదు.
చక్కనైన వైద్య మందకన్?చావ సిద్ధమాయె!నీతి! శౌరి!ప్రాణభిక్ష!పెట్టవా?
వక్కలైన!బేధ భావతన్?పావనంబు!మట్టిగర్చె?పౌర!స్వార్ధచింత!పెచ్చయెన్?
దక్కనీని!తీరు శోధనన్?దైవదూష!మింటినంటె?ధారయామసీతి!దైవమా?
చెక్కలాయె?ప్రజ్ఞ పా ఠవం?సేవమాని?బీరువాయె!శ్రీరజంబు!శోకె!ధాత్రినిన్!

1.గర్భగత"-మత్తరజినీద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
1.చక్కనైన!వైద్యమందకన్?           2.శౌరి!ప్రాణభిక్ష పెట్టవా?
  వ్రక్కలైన!బేధభావతన్?                  స్వార్ధచింత! పెచ్చయెన్?
 దక్కనీని !తీరు శోధతన్?                 ధారయామసీతి!దైవమా?
చెక్కలాయె!ప్రజ్ఞ పాఠవమ్!               శ్రీరజంబు శోకె!ధాత్రినిన్?

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు
చావ సిద్ధమాయె?నీతి!
పావనంబు!మట్టిగర్చె?
దైవదూష! మింటి నంటె?
సేవ మాని బీరువాయె?

3.గర్భగత"-రజోరంజిత"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చక్కనైన వైద్య మందకం?చావ సిద్ధమాయె?నీతి?
వ్రక్కలైన!బేధ భావతం?పావనంబు మట్టిగర్చె?
దక్కనీని!తీరు శోభతం?దైవ దూష మింటి నంటె?
చెక్కలాయె?ప్రజ్ఞ పాఠవం?సేవ మాని!బీరువాయె?

4.గర్భగత"-యతిర్నవ సుగంధిద్వయ"-వృత్తములు.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చావ!సిద్ధమాయెనీతి? శౌరి!ప్రాణభిక్ష పెట్టవా?
పావనంబు!మట్టిగర్చె?పౌర!స్వార్ధచింత!పెచ్చయెన్?
దైవదూష!మింటినంటె?ధారయామసీతి!దైవమై?
సేవమాని!బీరువాయె?శ్రీరజంబు!శోకె ధాత్రినిన్?

2.చావ!సిద్ధమాయె!నీతి?చక్కనైన!వైద్య మందకన్?
   పావనంబు!మట్టిగర్చె?వ్రక్కలైన!బేధ భావతన్?
   దైవదూష!మింటినంటె? దక్కనీని!తీరు శోభతన్?
   సేవమాని!బీరువాయె?చెక్కలాయె?ప్రజ్ఞ పాఠవమ్?

5.గర్భగత"-కొంగుబంగరుద్వయ"-వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
చావ!సిద్ధమాయె!నీతి?శౌరి!ప్రాణభిక్ష!పెట్టవా?చక్కనైన!వైద్యమందకన్?
పావనంబు!మట్టిగర్చె?పౌర!స్వార్ధచింతపెచ్చె?వ్రక్కలైన!బేధభావతన్?
దైవదూష!మింటినంటె?ధారయామసీతి!దైవమై?దక్కనీని!తీరుశోభతన్?
సేవమాని!బీరువాయె?శ్రీరజంబు!శోకె!ధాత్రినిం?చెక్కలాయె!ప్రజ్ఞపాఠవమ్?

2.
చావ!సిద్ధమాయె!నీతి?చక్కనైన!వైద్యమందకం?శౌరి!ప్రాణభిక్ష!పెట్టవా?
పావనంబు!మట్టిగర్చె?వ్రక్కలైన!బేధ భావతం?పౌర!స్వార్ధచింత!పెచ్చె?
దైవదూష!మింటినంటె?దక్కనీని!తీరుశోభతం?ధారయామసీతి!దైవమై?
సేవ!మాని బీరువాయె?చెక్కలాయె?ప్రజ్ఞ పాఠవం?శ్శ్రీరజంబు!శోకె ధాత్రినిన్?

6.గర్భగత"-రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శౌరి!ప్రాణభిక్ష!పెట్టవా?చక్కనైన!వైద్య మందకన్?
పౌర!స్వార్ధచింత!పెచ్చె?వ్రక్కలైన!బేధ!భావతన్?
ధారయామసీతి!దైవమై?దక్కనీని!తీరు శోభతన్?
శ్రీరజంబు!శోకె!ధాత్రినిం?చెక్కలాయె?ప్రజ్ఞ పాఠవమ్?

7.గర్భగత"-కల్పద్రుమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
శౌరి!ప్రాణభిక్ష!పెట్టవా?చక్కనైన!వైద్యమందకం?చావ!సిద్ధమాయె!నీతి?
పౌర!స్వార్ధ చింత పెచ్చె?వ్రక్కలైన!బేధభావతం?పావనంబు!మట్టిగర్చె?
ధారయామసీతి!దైవమై?దక్కనీని!తీరుశోభతం?దైవదూష!మింటినంటె?
శ్రీరజంబు!శోకె ధాత్రినిం?చెక్కలాయె?ప్రజ్ఞ పాఠవం?సేవమాని!బీరువాయె?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పాండితీ స్రష్టకు ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.