గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, మే 2018, మంగళవారం

భారణా,నిన్నేను,భూధర,జీవనా,జెట్టి,చిందిలు,సన్మంగళ,కందొనరు,మందత,రచన:-శ్రె వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.

భారణా,నిన్నేను,భూధర,జీవనా,జెట్టి,చిందిలు,సన్మంగళ,కందొనరు,మందత,

గంధినీ,గర్భ "గంధసౌరుల"-వృత్తము.

రచన:-శ్రె వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
"గంధసౌరుల"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.న.భ.భ.రజ.త.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
గంధిని గంధసౌరులవి!గంధ ధరాలు,రుహాలు!కట్టుదప్పి!విధ్వంస మేర్పన్?
గంధమనోజ్ఞ!భావతను!కందొనరింతు! రేమొకొ? గట్టిపట్టు!  సన్మంగళంబే?
చిందిలనీక?త్రొక్కెదవె?చిందర వందరజేసి!   జెట్టులౌట!మిథ్యేదలంపన్?
మందయుమాయు!మేల్కొనవె?మందతనంబుతప్పు!మిట్టిపాటు!దోషంబు
                                                                                         సుమ్మా?

గంధిని=భూదేవి,గంధసౌరులు=భూవనరులు,గంథధరాలు,రుహాలు=కొండలు
వనములు,గంథ మనోజ్ఞభావత=భూదేవియొక్కనాహ్లాదకర,మనోగతము,
సన్మంగళం=శుభకరము,చిందిలు=వ్యాపించు,చిందర వందర=చెల్లాచెదరు,
జెట్టులు=శూరులు,మిధ్య=మాయ(అసత్యము),మిట్టిపాటు=మిడిసిపడుట,
మందయుమాయు=లోకమందలిప్రజ,నశించును
కందొనరింతు=కృశింపజేతు

భావము:-భూవనరులను,కొండలు,వనములు,నీమముమీరి!నాశన మేర్చగా!
భూమాత!మనోజ్ఞభావత,కృశింపజేయు,చెడుపట్టుదల,శుభప్రదమా?కాదు.
మాతకీర్తిప్రబలనీక,చిందరవందరజేసి,శూరులయ్యేచింతన!మాయే,యగును.లోకమునశించును.మేల్కొనుము.మందబుద్ధిని వీడుము.మిడిసి పడుట దోషము సుమా!

1.గర్భగత"-భారణా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.న.గణములు.వృ.సం.471.ప్రాసనీమముగలదు.
గంధిని గంధ సౌరులవి?
గంధ మనోజ్ఞ భావతను?
చిందిలనీక!త్రొక్కెదవె?
మందయు మాయు మేల్కొనవె?

2.గర్భగత"నిన్నేనను"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.ర.గల.గణములు.వృ.సం.151.ప్రాసనీమముగలదు.
గంధ ధరాలు,రుహాలు?
కందొనరింతు రేమొకొ?
చిందర వందర జేసి!
మందతనంబు!తప్పు?

3.గర్భగత"-భూధర"-వృగణములు
బృహతీఛందమము.ర.య.య.గణములు.వృ.సం.75.ప్రాసగలదు.
కట్టు దప్పి!విధ్వంస మేర్పన్?
గట్టిపట్టు సన్మంగళంబే?
జెట్టులౌట!మిథ్యే!దలంపన్?
మిట్టిపాటు!దోషంబు సుమ్మా?8

4.గర్భగత"-జీవన"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.న.భ.భ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
గంధిని గంధసౌరులవి!గంధ ధరాలు,రుహాలు!
గంధమనోజ్ఞ భావతను!కందొనరింతు రేమొకొ?
చిందిలనీక?త్రొక్కెదవె! చిందర వందర!జేసి?
మందయు మాయు!మేల్కొనవె?మందతనంబు!తప్పు?

5గర్భగత"-జెట్టి"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.జ.త.గగ.గణములు.యతి.9.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
గంధ ధరాలు,రుహాలు!కట్టుదప్పి!విధ్వంసమేర్పన్?
కందొనరింతు రేమొకొ?   గట్టిపట్టు!   సన్మంగళంబే?
చిందర వందర జేసి?జెట్టులౌట? మిధ్యే?దలంపన్?
మందతనంబు!తప్పు!మిట్టిపాటు!దోషంబు!సుమ్మా?

6.గర్భగత"-చిందిలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.జ.త.మ.స.జ.లల.గణములు.
యతులు9,18.ప్రాసనీమముగలదు.
గంధ ధరాలు,రుహాలు,!కట్టుదప్పివిధ్వంసమేర్పం?గంధిని గంధసౌరులవి?
కందొనరింతురేమొకొ?!గట్టిపట్టు!సన్మంగళంబే?గంధమనోజ్ఞ!భావతను!
చిందర వందర!జేసి!జెట్టులౌట?మిథ్యే!దలంపన్?చిందిలనీక?త్రొక్కెదవె?
మందతనంబు తప్పు!మిట్టిపాటు!దోషంబు!సుమ్మా?మందయుమాయు మేల్కొనవె?

7.గర్భగత"-సన్మంగళ"-వృత్తము.
ధృతిఛందము.ర.య.య.భ.ర.న.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కట్టుదప్పి విధ్వంస మేర్పం?గంధిని గంధ సౌరులవి?
గట్టిపట్టు సన్మంగళంబే? గంధ మనోజ్ఞ భావతను!
జెట్టులౌట!మిథ్యే!దలంపన్?చిందిలనీక?త్రొక్కెదవె?
మిట్టిపాటు!దోషంబు!సుమ్మా?మందయు మాయు!మేల్కొనవె?

8.గర్భగత"-కందొనరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.య.భ.ర.న.భ.భ.గల.గణములు.
యతులు.10,19,ప్రాసనీమముగలదు
కట్టుదప్పి!విధ్వంసమేర్పం?గంధిని గంధసౌరులవి?గంధ ధరాలు,రుహాలు?
గట్టిపట్టు!సన్మంగళంబే?గంధ మనోజ్ఞ భావతను!కందొనరింతు!రేమొకొ?
జెట్టులౌట!మిథ్యే!దలంపం?చిందిలనీక?త్రొక్కెదవె?చిందరవందర!జేసి?
మిట్టిపాటు!దోషంబు!సుమ్మా?మందయుమాయు!మేల్కొనవె!మందతనంబు మాను?

9.గర్భగత"-మందతా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.స.జ.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
గంధ ధరాలు,రుహాలు!గంధిని గంధసౌరులవి?
కందొనరింతు! రేమొకొ?గంధ మనోజ్ఞ భావతను!
చిందర వందర!జేసి? చిందిలనీక!  త్రొక్కెదవె?
మందతనంబు మాను?మందయు!మాయు మేల్కొనవె?

10.గర్భగత"-గంధినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.స.జ.స.జ.త.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
గంధ ధరాలు,రుహాలు!గంధిని!గంధసౌరులవి?కట్టుదప్పి!విధ్వంసమేర్పన్?
కందొనరించు!తీరున?గంధమనోజ్ఞ భావతను!గట్టిపట్టు!సన్మంగళంబే?
చిందర వందరజేసి?చిందిలనీక!త్రొక్కెదవె?జెట్టులౌట!మిథ్యే దలంపన్?
మందతనంబు!మాను?మందయు!మాయు!మేదలంవె?మిట్టిపాటు దోషంబు!సుమ్మా?
 స్వస్తి.
మూర్తి  జుత్తాడ.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గంధ సౌరులు విరజిమ్ముతున్న గర్భగత వృత్తములు అలరించు చున్నవి పండితులవారికి శత వందనములు. మాకందించిన శ్రీ చింతా సోదరులకు కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.