గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, మే 2018, బుధవారం

ఆర్జనా,సమాశ్రీ,సాదృశీ,నరభరజా,ద్విరజభా,ఛండకీర్తి,ముప్పొనరు,గండుమీలు,దుర్మదా,చిదార్తినీ,గర్భ-"మాతృక్షోభా"-వృత్తము.. రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
ఆర్జనా,సమాశ్రీ,సాదృశీ,నరభరజా,ద్విరజభా,ఛండకీర్తి,ముప్పొనరు,గండుమీలు,దుర్మదా,చిదార్తినీ,గర్భ-"మాతృక్షోభా"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                      జుత్తాడ.
మాతృక్షోభావృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.భ.ర.జ.ర.జ.భ.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు..
కనులముందు చిదార్తిని!కాం చి యేమి జేయనైతి?గండుమీలు!ధూర్తజనులు?
చనగజేయు!శక్తేదిక?సంచితార్ధ! కీర్తి మాసె?ఛండ కీర్తి!  తాండవమున?
మనితి!దాసి జీవంబున!మంచిలేదు?యెంచి చూడ?మండె శోభలెల్ల?జగతి!
మునుపుకంటె!ముప్పయ్యెను!ముంచుకొచ్చె!దుర్మదంబు!మొండిజీవయాన
మగుచు?

1.గర్భగత"-ఆర్జనా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.భ.గణములు.వృ.సం.408.ప్రాసగలదు.
కనుల ముందు బీదార్తిని!
చనగ జేయు!శక్తేదిక?
మనితి దాసి జీవంబున?
మునుపు కంటె ముప్పయ్యెను

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
కాంచి!యేమి జేయనైతి?
సంచితార్ధ కీర్తి మాసె?
మంచిలేదు?యెంచి చూడ!
ముంచుకొచ్చె! దుర్మదంబు!

3.గర్భగత"-సాదృశీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.న.గణమలు.వృ.సం.491.ప్రాసగలదు.
గండు మీలు ధూర్త జనులు?
ఛండ కీర్తి తాండవమున!
మండె శోభలెల్ల? జగతి?
మొండి జీవయాన మగుచు?

4.గర్భగత"-నరభ రజా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.భ.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కనులముందు బీదార్తిని!కాంచి యేమి జేయనైతి?
 చనగజేయు శక్తేదిక? సంచితార్ధ కీర్తి మాసె?
మనితి! దాసి జీవంబున!మంచిలేదు?యెంచిచూడ?
మునుపు కంటె!ముప్పయ్యెను?ముంచుకొచ్చె!దుర్మదంబు?

5.గర్భగత"-ద్విరజభా"-వృత్తము
అత్యష్టీఛందము.ర.జ.ర.జఅత్యష్టీఛందముయతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కాంచి!యేమి జేయనైతి?గండుమీలు ధూర్త జనులు?
సంచితార్ధ కీర్తి మాసె?ఛండ కీర్తి తాండవమున!
మంచిలేదు?యెంచిచూడ?మండె! శోభలెల్ల?జగతి!
ముంచుకొచ్చె! దుర్మదంబు!మొండి జీవయాన మగుచు?

6.గర్భగత"-ఛండకీర్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.భ.న.స.య.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కాంచి!యేమిజేయనైతి?గండుమీలు ధూర్త జనులు?కనులముందు!బీదార్తిని
సంచితార్ధకీర్తి!మాసె!ఛండకీర్తి తాండవమున!చనగ జేయు!శక్తే ? దిక !
మంచిలేదు?యెంచిచూడ?మండె శోభలెల్ల జగతి?మనితి!దాసి జీవంబున!
ముంచుకొచ్చె దుర్మదంబు!మొండి జీవయానమగుచు!మునుపుకంటె!ముప్పయ్యెను?

7.గర్భగత"-ముప్పొనరు"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.న.న.ర.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
గండుమీలు!ధూర్తజనులు?కనులముందు బీదార్తిని
ఛండకీర్తి తాండవమున!చనగజేయు శక్తేదిక?
మండె శోభలెల్ల జగతి?మనితి దాసి జీవంబున?
మొండి జీవయానమగుచు!మునుపుకంటె!ముప్పయ్యెను?

8.గర్భగత"-గండుమీల"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.న.న.ర.భ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
గండుమీలు!ధూర్తజనులు?కనులముందు బీదార్తిని!కాంచి యేమిజేయనైతి?
ఛండకీర్తి!తాండవమున!చనగ జేయు శక్తేదిక?సంచితార్ధ కీర్తి మాసె?
మండె!శోభలెల్ల జగతి?మనితి దాసిజీవంబున?మంచిలేదు?యెంచిచూడ?
మొండి!జీవయాన మగుచు!మునుపుకంటె!ముప్పయ్యెను?ముంచుకొచ్చె!
దుర్మదంబు?

9.గర్భగత"-దుర్మద"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.స.య.లల.గణములు.యతి.9,వ.యక్షరము
ప్రాసనీమముగలదు.
కాంచియేమి !జేయనైతి?కనులముందు!చిదార్తిని!
సంచితార్ధ కీర్తి మాసె? చనగజేయు!శక్తేదిక?
మంచిలేదు?యెంచిచూడ?మనితి దాసి జీవంబున!
ముంచుకొచ్చె!దుర్మదంబు!మునుపుకంటె!ముప్పయ్యెను?

10.గర్భగత"-చిదార్తినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.స.య.స.జ.భ.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కాంచియేమి జేయనైతి?కనులముందు చిదార్తిని?గండుమీలు!ధూర్తజనులు?
సంచితార్ధకీర్తి!మాసె!చనగ జేయు శక్తేదిక?ఛండకీర్తి తాండవమున?
మంచిలేదు?యెంచిచూడ!మనితి దాసి జీవంబున?మండెశోభలెల్ల కీర్తి?
ముంచుకొచ్చె!దుర్మదంబు?మునుపుకంటె!ముప్పయ్యెను?మొండిజీవయాన మగుచు!
స్వస్తి.


మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అలతి అలతి పదములతో అన్నిపద్యములు అలరించు చున్నవి
పండిత బ్రమ్మ లిరువురికీ ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.