గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మే 2018, గురువారం

భారణా,నిదర్శనా,పరిహరణా,కోటిప్రభాసి,భ్రాంతినీ,చెల్వుడ,వెన్నాడు,వీడనినీడ,చాతురిభా,బల్వరి,గర్భకర్మచేతనావృత్తము.రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

 జైశ్రీరామ్.
భారణా,నిదర్శనా,పరిహరణా,కోటిప్రభాసి,భ్రాంతినీ,చెల్వుడ,వెన్నాడు,వీడనినీడ,చాతురిభా,బల్వరి,గర్భకర్మచేతనావృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                      జుత్తాడ.

       -"కర్మచేతనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.న.భ.భ.భ.భ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
చేసిన తప్పు!చేయకుమి!చెల్వుడయిందము మీరకు!చేతన మంచినేర్చుమా?
వాసివిగమ్ము!కీర్తికిని!బల్వరి నంచు తెగించకు?పాతక మంటనీకుమా!
భాసిత!ముత్య మీవనగ?పల్వురమెప్పలనందుమ!భౌతిక!భ్రాంతి వీడుచున్
శాసన!బద్ధధర్మతను!చల్వను!కూర్చుమ!మాతకు!జాతివివక్ష దూరతన్?


చెల్వుడయిందము=స్నేహము,మీరకుచేతన=చేతనమతిశయించకు,
వాసివిగమ్ము=పేరొందినవాడివగుము,భౌతికభ్రాంతి=భౌతికదేహముపై
యపేక్ష,చల్వనుగూర్చుమ=చల్లదనమునుచేకూర్చుమ,జాతివివక్ష=
జాతులందుతేడాభావము,బల్వరి=బలవంతుడు.

1.గర్భగత"-భారణా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.న.గణములు.వృ.సం.471.ప్రాసగలదు.
చేసినతప్పు!చేయకుమి!
వాసివి!  గమ్ము కీర్తికిని!
భాసిత! ముత్య మీవనగ?
శాసన బద్ధ! ధర్మతను!

2.గర్భగత"-నిదర్శనా"-వృత్తము.
బృహతీఛందము.భ.భ.భ.గణములు.వృ.సం.439.ప్రాసగలదు.
చెల్వుడయిందము మీరకు!
బల్వరినంచు!తెగించకు!
పల్వుర మెప్పుల నందుమ!
చల్వను కూర్చుమ!మాతకు?

3.గర్భగత"-పరిహరణా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.ర.లగ.గణములు.వృ.సం.87.ప్రాసగలదు.
చేతన మంచి నేర్చుమా!
పాతక మంట నీకుమా!
భౌతిక భ్రాంతి వీడుచున్?
జాతి వివక్ష దూరతన్!

4.గర్భగత"-కోటిప్రభాసి"-వృత్తము.
ధృతిఛందము.భ.ర.న.భ.భ.భ.గణములు.యతి.10,యక్షరము.
ప్రాసనీమముగలదు.
చేసినతప్పు!చేయకుమి!చెల్వుడయిందము!మీరకు!
వాసివిగమ్ము!కీర్తికిని!బల్వరినంచు! తెగించకు?
భాసిత ముత్యమీవనగ?పల్వుర!మెప్పులనందుమ!
శాసన!బద్ధ ధర్మతను!చల్వను కూర్చుమ!మాతకు!

5.గర్భగత"-భ్రాంతినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.భ.భ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చెల్వుడయిందము!మీరకు!చేతన మంచి నేర్చుమా?
బల్వరినంచు?తెగించకు?పాతక మంటనీకుమా?
పల్వుర మెప్పుల నందుమ!భౌతిక భ్రాంతి వీడుచున్?
చల్వను కూర్చుమ!మాతకు!జాతివివక్ష దూరతన్?

6.గర్భగత"-చెల్వుడ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.భ.భ.ర.య.స.జ.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
చెల్వుడయిందము!మీరకు?చేతనమంచినేర్చుమా!చేసిన తప్పు చేయకుమి?
బల్వరినంచు!తెగించకు?పాతక మంటనీకుమా!వాసివి గమ్ము?కీర్తికిని?
పల్వుర!మెపులనందుమ!భౌతిక భ్రాంతి వీడుచుం?భాసిత!ముత్యమీవనగ?
చల్వను!కూర్చుమ!మాతకు?జాతి వివక్షదూరతం?శాసన బద్ధ ధర్మతను?

7.గర్భగత"-వెన్నాడు"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.య.స.జ.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చేతన మంచి నేర్చుమా!చేసినతప్పు!సేయకుమి?
పాతక మంటనీకుమా!వాసివిగమ్ము?కీర్తికిని!
భౌతిక భ్రాంతి వీడుచుం?భాసిత ముత్య మీవనగ!
జాతివివక్ష దూరతం?శాసన బద్ధ దర్మతను!

8.గర్భగత"-వీడనినీడ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.య.స.జ.స.స.స.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
చేతన!మంచినేర్చుమా?చేసినతప్పు సేయకుమి?చెల్వుడయిందము!మీరకు?
పాతక!మంటనీకుమా?వాసివిగమ్ము!కీర్తికిని!బల్వరినంచు?తెగించకు?
భౌతిక భ్రాంతి!వీడుచుం?భాసిత!ముత్యమీవనగ?పల్వుర!మెప్పులనందుమ!
జాతి వివక్షదూరతం?శాసన!బద్ధ ధర్మతను!చల్వను! కూర్చుమ!మాతకు?

9.గర్భగత"-చాతురిభా"-వృత్తము.
ధృతిఛందము.భ.భ.భ.భ.ర.న.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చెల్వుడయిందము!మీరకు?చేసినతప్పు!సేయకుమి?
బల్వరినంచు?తెగించకు?వాసివిగమ్ము!కీర్తికిని!
పల్వుర మెప్పుల నందుమ! భాసిత ముత్యమీవనగ?
చల్వను కూర్చుమ!మాతకు?శాసన బద్ధ ధర్మతను!

10,గర్భగత"-బల్వరి"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.భ.భ.ర.న.భ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
చెల్వుడయిందము!మీరకు?చేసిన తప్పు సేయకుమి?చేతన మంచినేర్చుమా!
బల్వరినంచు?తెగించకు?వాసివిగమ్ము?కీర్తికిని! పాతక మంటనీకుమా?
పల్వుర మెప్పుల నందుమ!భాసితముత్యమీవనగ!భౌతికభ్రాంతి!వీడుచున్?
చల్వను కూర్చుమ మాతకు?శాసన బద్ధ ధర్మతను!జాతివివక్ష దూరతన్?
స్వస్తి.
మూర్తి. జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

sam చెప్పారు...

dear sir very good blog and very good content
Telangana News

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.