గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, మే 2018, సోమవారం

మత్తరజినీద్వయ,చీకట్లలరు,కౌతుక,రజినీకరప్రియద్వయ , పేరొనరని, రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
మత్తరజినీద్వయ,చీకట్లలరు,కౌతుక,రజినీకరప్రియద్వయ , పేరొనరని,
కర్మకృత,శ్రమణా,గర్భ "నిర్మలాత్మ"-ద్వయ,వృత్తములు.
రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
   జుత్తాడ.
నిర్మలాత్మ ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.య.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
1.కోతిచేష్టలేలనో?నరా!కోరి పాత జన్మ!జ్ఞప్తికా?కూర్మి నెంచి జీవించుమా!
భూతిగోరి!ధర్మత్యాజ్యమా?పూరయిత్వ!రక్షకుండవై!వోర్మిగల్గి!సామ్యంబునన్
చేతనైన!సాయమొప్పుమా!చేరికొందు!కీర్తిరాజ్యముం?శ్రీర్మహీషి!దీవించురా!
ఘాతుకాలుమాని! మెల్గుమా!కారుచిచ్చుగాకు!కూతకుం?కర్మసాక్షిమేల్మేలగున్

2.కోరిపాతజన్మజ్ఞప్తికా?కోతిచేష్టలేలనో?నరా!కూర్మినెంచి!జీవించుమా!
  పూరయిత్వ రక్షకుండవై!భూతిగోరి!ధర్మత్యాజ్య మా!వోర్మిగల్గిసామ్యంబునం
చేరికొందు!కీర్తిరాజ్యముం?చేతనైన సాయమొప్పుమా!శ్రీర్మహీషి!దీవించురా!
కారుచిచ్చుగాకు!కూతకుం?ఘాతుకాలు!మానిమెల్గుమా!కర్మసాక్షిమేల్మేలగున్

1
గర్భగత"మతత్తరజినీద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
1.కోతిచేష్ట!లేలనో?నరా!              2.కోరి!పాత జన్మ జ్ఞప్తికా?
భూతిగోరి!ధర్మత్యాజ్యమా?            పూరయిత్వ!రక్షకుండవై!
చేతనైన!సాయమొప్పుమా!           చేరికొందు!కీర్తి రాజ్యమున్?
ఘాతుకాలు!మాని మెల్గుమా!        కారుచిచ్చుగాకు!కూతకున్?

2.గర్భగత"-చీకట్లలరు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.య.లగ.గణములు.వృ.సం.75.ప్రాసగలదు.
కూర్మినెంచి!జీవించుమా!
వోర్మిగల్గి!సామ్యంబునన్?
శ్రీర్మహీషి! దీవించురా!
కర్మసాక్షి!  మేల్మేలగున్?

3.గర్భగత"-కౌతుక"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.య.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కోరి!పాతజన్మజ్ఞప్తికా?కూర్మినెంచి!జీవించుమా!
పూరయిత్వ!రక్షకుండవై!వోర్మిగల్గి!సామ్యంబునన్?
చేరికొంద!కీర్తిరాజ్యముం?శ్రీర్మహీషి!దీవించురా!
కారుచిచ్చుగాకుకూతకుం?కర్మసాక్షి!మేల్మేలగున్?

4.గర్భగత"-రజినీకరప్రియ"-ద్వయవృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కోతిచేష్టలేలనో?నరా!కోరిపాత జన్మ! జ్ఞప్తికా?
భూతిగోరి!ధర్మత్యాజ్యమా?పూరయిత్వ!రక్షకుండవై?
చేతనైన!సాయమొప్పుమా?చేరికొందు!కీర్తి రాజ్యమున్?
ఘాతుకాలు!మాని మెల్గుమా!కారుచిచ్చుగాకు!కూతకున్?

2.కోరి పాతజన్మ జ్ఞప్తికా?కోతిచేష్ట లేలనో?నరా!
పూరయిత్వ రక్షకుండవై!భూతిగోరి!ధర్మత్యాజ్యమా?
చేరికొందు!కీర్తిరాజ్యముం?చేతనైన!సాయమొప్పుమా?
కారుచిచ్చుగాకు?కూతకుం!ఘాతుకాలు!మాని మెల్గుమా?

5.గర్భగత"-పేరొనరని"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.య.య.జ.ర.లగ.గణములు.
యతులు.10,18.ప్రాసనీమముగలదు.
కోరిపాతజన్మ జ్ఞప్తికా?కూర్మినెంచి జీవించుమా!కోతిచేష్ట!లేలనో?నరా?
పూరయిత్వ!రక్షకుండవై?వోర్మిగల్గి!సామ్యంబునం!భూతిగోరిధర్మవ్యాజ్యమా
 చేరికొందు!కీర్తిరాజ్యముం?శ్రీర్మహీషి!దీవించురా!చేతనైనసాయ మొప్పుమా?
కారుచిచ్చుగాకు!కూతకుం?కర్మసాక్షి!మేల్మేలగుం!ఘాతుకాలుమానిమెల్గుమా?


6.గర్భగత"-కర్మకృత"-వృత్తము.
అత్యష్టీవృత్తము.ర.య.య.జ.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కూర్మినెంచి!జీవించుమా!కోతిచేష్ట లేలనో?నరా!
వోర్మిగల్గి!సామ్యంబునం?భూతిగోరి!ధర్మవ్యాజ్యమా?
శ్రీర్మహీషి!దీవించురా!చేతనైన!సాయమొప్పుమా?
కర్మసాక్షిమేల్మేలగుం?ఘాతుకాలు!మానిమెల్గుమా?

7.గర్భగత"-శ్రమణా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.య.జ.ర.య.జ.ర.లగ.గణములు.
యతులు.9,18.ప్రాసనీమముగలదు.
కూర్మినెంచి!జీవించుమా?కోతిచేష్టలేలనో?నరా!కోరిపాతజన్మ!జ్ఞప్తికా?
వోర్మిగల్గి!సామ్యంబునం?భూతిగోరి!ధర్మవ్యాజ్యమా?పూరయిత్వ!రక్షకుండవై
శ్రీర్మహీషి!దీవించురా!చేతనైనసాయమొప్పుమా?చేరికొందు!కీర్తిరాజ్యమున్?
కర్మసాక్షి!మేల్మేలగుం?ఘాతుకాలుమానిమెల్గుమా!కారుచిచ్చుగాకుకూతకున్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.                                                                                                                                                                                  జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
" కోతి చేష్ట లేలనో కోరిపాతజన్మ జ్ఞప్తికా ? అని వివిధ ఛందస్సులలో చక్కని పద్యములను అందించిన శ్రీ వల్లభవఝుల వారికి ప్రణామములు. శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.