గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, మే 2018, గురువారం

వినయశ,వరమార్గ,శాసయా,ప్రమద,సన్నిజా,కోమల,ధన్యతా,జతయుతి, స్తుతికర,కమలాకర,గర్భ"క్రతుఫల"- వృత్తము . రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
వినయశ,వరమార్గ,శాసయా,ప్రమద,సన్నిజా,కోమల,ధన్యతా,జతయుతి,
స్తుతికర,కమలాకర,గర్భ"క్రతుఫల"- వృత్తము .
రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.
   జుత్తాడ.

       "  క్రతుఫల"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.స.స.న.జ.జ.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
గతిజతయుతి నమకం!గమకాశ్రిత చమకం!కమలాకర కోమలంబౌ?
స్తుతికరులకు వరదం!సుమసౌరభ పరమం!సుమనోహర భూతిధామం?
క్రతుఫల సమ సురధం!క్రమజీవన గమనం!రమమౌ నరజన్మ  ధన్యం?
బ్రతుకునకిది ప్రమదం!భ్రమరాంబకు నిలయం! రమణీయము  ముక్తిగమ్యం?

1.గర్భగత"-వినయశ"-వృత్తము.
బృహతీఛందము.న.న.స.గణములు.వృ.సం.256.ప్రాసగలదు.
గతి జతయుతి నమకం!
స్తుతికరులకు వరదం!
క్రతుఫలసుమ సురధం!
బ్రతుకునకిది ప్రమదం!

2.గర్భగత"-వరమార్గ"వృత్తము.
అనుష్టుప్ఛందము.స.న.లగ.గణములు.వృ సం.124.ప్రాసగలదు.
గమకాశ్రిత చమకం!
సుభసౌరభ పరమం!
క్రమజీవన గమనం!
భ్రమరాంబకు నిలయం!

3.గర్భగత"-శాసయా"వృత్తము.
బృహతీఛందము.స.స.య.గణములు.వృ.సం.92.ప్రాసనీమముగలదు.
కమలాకర కోమలంబౌ?
సుమనోహర భూతిధామం?
రమమౌ నరజన్మ  ధన్యం!
రమణీయము,ముక్తి గమ్యం!

4.గర్భగత"-ప్రమద"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.స.న.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
గతిజత యుతి నమకం! గమకాశ్రిత చమకం!
స్తుతి కరులకు వరదం! సుమసౌరభ పరమం!
క్రతుఫల సమ సురధం! క్రమ జీవన గమనం!
బ్రతుకున కిది ప్రమదం! భ్రమరాంబకు నిలయం!

5.గర్భగత"-సన్నిజా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.న.జ.జ.జ.గగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
గమకాశ్రిత చమకం!కమలాకర కోమలంబౌ?
సుమ సౌరభ పరమం!సు మనోహర భూతి ధామం
క్రమజీవన గమనం!రమమౌ? నరజన్మ ధన్యం?
భ్రమరాంబ నిలయం? రమణీయము ముక్తి గమ్యం?

6.గర్భగత"-కోమల"వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.జ.జ.జ.త.న.న.లగ.గణములు.
ప్రాసనీమముగలదు.
గమ కాశ్రిత చమకం! కమలాకర కోమలంబౌ! గతి జత యుతి నమకం!
సుమసౌరభ పరమం!సు మనోహర భూతి ధామం!స్తుతి కరులకు వరదం!
క్రమ జీవన గమనం!రమమౌ?నరజన్మ ధన్యం!క్రమఫల సుమ సురధం?
భ్రమరాంబ నిలయం!రమణీయము, ముక్తి గమ్యం!బ్రతుకునకిది ప్రమదం!

7.గర్భగత"-ధన్యతా"-వృత్తము.
ధృతిఛందము.స.స.య.న.న.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కమలాకర కోమలంబౌ!గతి జత యుతి నమకం!
సు మనోహర భూతి ధామం!స్తుతి కరులకు వరదం!
రమమౌ నరజన్మ ధన్యం!క్రమఫల సుమ సురధం!
రమణీయము ముక్తి గమ్యం! బ్రతుకునకిది ప్రమదం!

8.గర్భగత"-జత యుతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.య.న.న.స.స.న.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కమలాకర కోమలంబౌ?గతి జత యుతి నమకం!గమకాశ్రిత చమకం!
సు మనోహర భూతి ధామం! స్తుతి కరులకు వరదం!సుమ సౌరభ పరమం!
రమమౌ నరజన్మ ధన్యం?క్రమఫల సుమ సురధం!క్రమ జీవన గమనం!
రమణీయము ముక్తి గమ్యం!బ్రతుకున కిది ప్రమదం!భ్రమరాంబ నిలయం!

9.గర్భగత"-స్తుతి కర వృత్తము.
అత్యష్టీఛందము.స.న.జ.న.న.లగ.గణములు.యతి.9.యక్క్షరము.
ప్రాసనీమముగలదు.
గమకాశ్రిత చమకం!గతి జత యుతి నమకం!
సుమ సౌరభ పరమం!స్తుతి కరులకు వరదం!
క్రమ జీవన గమనం!క్రమ ఫల సుమ సురధం?
భ్రమరాంబ నిలయం!బ్రతుకున కిది ప్రమదం!

10,గర్భగత"-కమలాకర"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.జ.న.న.జ.జ.జ.గగ.గణములు.యతులు9,18.
ప్రాసనీమముగలదు.
గమకాశ్రిత చమకం!గతి జత యుతి నమకం!కమలాకర కోమలంబౌ?
సుమ  సౌరభ పరమం!స్తుతి కరులకు వరదం!సు మనోహర భూతి ధామం!
క్రమ జీవన గమనం!క్రమ ఫల సుమ సురధం!రమమౌ నరజన్మ ధన్యం!
భ్రమరాంబ నిలయం!బ్రతుకున కిది ప్రమదం!రమణీయము ముక్తి గమ్యం!
స్వస్తి.


మూర్తి. జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అద్భుత మైన చందస్సులను అనునిత్యము అందిస్తున్న కవి పండితు లిరువురికీ కృతజ్ఞతాభి వందనములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.