గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మే 2018, గురువారం

మోహనా ,వినుత, ఆనంద, నమోన్నత, తాత్విక, సడలని,అపేక్షత, రససరి,రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి .

జైశ్రీరామ్.
మోహనా ,వినుత, ఆనంద, నమోన్నత, తాత్విక, సడలని,అపేక్షత, రససరి,
మనంగా,నమాయ నత,గర్భ పరిపూర్ణ వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి .
                                                                    జుత్తాడ.

    -"పరిపూర్ణవృత్తము"-
ఉత్కృతిఛందము.న.త.మ.న.మ.య.ర.స.గగ.గణములు.యతులు 10,19.
ప్రాసనీమముగలదు.
గుడిని మ్రింగే దగాకోరుల్?గుడిలొలింగం మెక్క లెక్కా!కూడునేపరిపూర్ణత్వం!
జడుపులేదే?పరంబోపం!సడలనీరే!ధీరతత్వం?జాడదెల్యని!తేజానన్?
పుడమిగూల్చే!ధనాపేక్షం!పొడలనాగులద్దామనంగం?పోడిమిన్చెడు!పూజ్యంబౌ?
పొడుపుమాటల్వినాశంబౌ!పొడుతురేజీవాతురాణాం?బూడిదౌతుది జీవంబుల్?

1.గర్భగత"-మోహనా"-వృత్తము
బృహతీఛందము.న.త.మ.గణములు.వృ.సం.40.ప్రాసగలదు.
గుడిని మ్రింగే దగాకోరుల్?
జడుపు లేదే?పరంబోపన్?
పుడమి!గూల్చే!ధనాపేక్షం?
పొడుపు మాటల్వినాశంబౌ!

2.గర్భగత"-వినుత"-వృత్తము.
బృహతీఛందము.న.మ.య.గణములు.వృ.సం.72.ప్రాసగలదు 
.గుడిలొ లింగం మెక్క లెక్కా?
సడల నీరే? ధీర తత్వం?
పొడలు నాగుపొడుతురే
పొడుతురే!జీవాతురాణాం?

3.గర్భగత"-ఆనంద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.గగ.గణములు.వృ.సం.27.ప్రాసగలదు.
కూడునే?పరిపూర్ణత్వమ్!
జాడ దెల్యని !తేజానన్?
పోడిమిం జెడు!పూంబౌ?
బూడిదౌ తుది జీవంబుల్?

4.గర్భగత"-నమోన్నత"-వృత్తము.
ధృతిఛందము.న.త.మ.న.మ.య.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
గుడిని మ్రింగే!దగాకోరుల్?గుడిలొ!లింగం!మెక్క లెక్కా?
జడుపు లేదే? పరంబోపన్?సడలనీరే?ధీరతత్త్వమ్?
పుడమి గూల్చే!ధనాపేక్షం?పొడల నాగుల్దామనంగన్?
పొడుపు మాటల్వినాశంబౌ?పొడుతురే?జీవాతురాణామ్!

5.గర్భగత"-తాత్విక"-వృత్తము.
అత్యష్టీఛందము.న.మ.య.ర.స.గగ.గణములు.యతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
గుడిలొ!లింగం! మెక్క లెక్కా?కూడునే?పరిపూర్ణత్వమ్?
సడలనీరే?ధీర తత్వం?జాడదెల్యని తేజానం?
పొడల నాగుల్దామనంగన్?పోడిమిం?చెడుపూజ్యంబౌ?
పొడుతురే!జీవాతురాణాం?బూడిదౌతుది! జీవముల్!

6.గర్భగత"-సడలని"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.య.ర.స.త.స.ర.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
గుడిలొ!లింగం మెక్క లెక్కా?కూడునే? పరిపూర్ణత్వం?గుడిని మ్రింగే!దగాకోరుల్?
సడలనీరే?ధీరతత్వం?జాడదెల్యని!తేజానం?జడుపులేదే?పరంబోపన్?
పొడల నాగుల్దామనంగం?పోడిమిం! చెడుపూజ్యంబౌ!పుడమిగూల్చే!ధనాపేక్షన్?
పొడుతురే?జీవాతురాణాం?బూడిదౌ! తుదిజీంబుల్పొడుపుమాటల్?
వినాశంబౌ?

7.గర్భగత"-అపేక్షితా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.త.స.ర.గగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కూడునే?పరిపూర్ణత్వమ్?గుడిని మ్రింగేదగాకోరుల్?
జాడ తెల్యని!తేజానన్?జడుపు లేదే?పరంబోపన్?
పోడిమిం? చెడు పూర్ణంబౌ?పుడమి గూల్చే! ధనాపేక్షన్?
బూడిదౌ!తుది జీవంబుల్?పొడుపు మాటల్వినాశంబౌ?

8.గర్భగత"-రస సరి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.త.స.ర.త.స.త.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కూడునే!పరిపూర్ణత్వం?గుడిని మ్రింగే!దగాకోరుల్?గుడిలొ!లింగం!మెక్కలెక్కా
జాడతెల్యని తేజానం?జడుపులేదే?పరంబోపం!సడలనీరే!ధీరత్వం?
పోడిమిం!చెడుపూర్ణంబౌ?పుడమికూల్చే!ధనాపేక్షం!పొడలనాగుల్దామనంగం?
బూడిదౌ తుది జీవంబుల్పొడుపు మాటల్వినాశంబౌ?పొడుతురే!జీవాతురాణాం?

9.గర్భగత"-మనంగా"-వృత్తము.
ధృతిఛందము.న.మ.య.న.త.మ.గణములు.యతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
గుడిలొ లింగం మెక్క లెక్కా?గుడిని మ్రింగే దగాకోరుల్?
సడలనీరే!ధీరత్వం?జడుపు లేదే?పరంబోపన్?
పొడలనాగుల్దామనంగన్?పుడమిగూల్చే!ధనాపేక్షన్?
పొడుతురే!జీవాతురాణాం!పొడుపు మాటల్వినాశంబౌ?

10.గర్భగత"-నమాయానత"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.య.న.త.మ.ర.స.గగ.గణములుయతుల.10,19
ప్రాసనీమముగలదు.
గుడిలొలింగం!మెక్క లెక్కా!గుడినిమ్రింగే!దగాకోరుల్కూడునే!పరిపూర్ణత్వమ్
సడలనీరే!ధీరత్వం!జడుపులేదే!పరంబోపం? జాడతెల్యని! తేజానన్?
పొడల నాగుల్దామనంగం!పుడమి!నాగుల్దామనంగంపోడిమింజెడు!పూరణంబౌ?
పొడుతురే!జీవాతురాణాం!పొడుపు మాటల్వినాశంబౌ?బూడిదౌ!తుది జీవంబుల్?

  స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఎన్నెన్నో కొత్త వృత్తములను మాకంది స్తున్నందులకు శ్రీ వల్లభవఝుల వారికి శత వందనములు .సోదరులు శ్రీ చింతావారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.