గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, మే 2018, మంగళవారం

చంప,త్రిజామర,చిత్రపద,గంధినీ,భ్రామతి,చిరామయ,గరీయతా,జీవప్రతీక,ప్రాయోజిక,కీర్తికామిద,గర్భ-"శాంతిపూర్ణ"-వృత్తము. రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
చంప,త్రిజామర,చిత్రపద,గంధినీ,భ్రామతి,చిరామయ,గరీయతా,జీవప్రతీక,ప్రాయోజిక,కీర్తికామిద,గర్భ-"శాంతిపూర్ణ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
  జుత్తాడ.

శాంతిపూర్ణవృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.భ.జ.జ.జ.భ.భ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.

చెలిమికి లేదు స్వార్ధము?చిరామయ జీవప్రతీక! క్షేమక మెంచ?నిద్ధరన్!
బలిదము!శాంతి ప్రపూర్ణము?పరార్ధప్రయోజక!మౌను?భాములెడంజను!శోభన్?
కలుముల!కాకరమ్మగు?గరీయత!చేకురు?ప్రేమ!కామిద!కీర్తిప్రదమ్మగున్?
వలదిక!ద్వేషభావ మిల?వరామయ!జీవమునందు!భ్రామది!నిశ్చలమందున్!
బలిదము=బలమైనది,భ్రామది=నిలకడలేనిమనస్సు.

1.గర్భగత"-చంప"-వృత్తము.
బృహతీఛందము.న.జ.భ.గణములు.వృ.సం.432.ప్రాసగలదు.
చెలిమికి లేదు? స్వార్ధము!
బలిదము!శాంతి ప్రపూర్ణము!
కలుముల!  కాకరమ్మగు!
వలదిక?ద్వేషభావమిలల?

2.గర్భగత"-త్రిజామర"-వృత్తము.
బృహతీఛందము.జ.జ.జ.గణములు.వృ.సం.366.ప్రాసగలదు.
చిరామయ!జీవప్రతీక!
పరార్ధ ప్రయోజక మౌను!
గరీయత!చేకురు!ప్రేమ?
వరామయ!జీవమునందు!

3.గర్భగత"-చిత్రపద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.భ.గగ.గణములు.వృసం.55.ప్రాసగలదు.
క్షేమక మిద్ధర!నెంచన్?
భాములెడం జను?శోభన్!
కామిద కీర్తి   ప్రధంబౌ?
భ్రామది!నిశ్చల మందున్?

4.గర్భగత"-గంధినీ"-వృత్తము.
ధృతిఛందము.న.జ.భ.జ.జ.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చెలిమికి!లేదు?స్వార్ధము!చిరామయ!జీవప్రతీక!
బలిదము!శాంతి!పూర్ణము!పరార్ధ!ప్రయోజక!మౌను!
కలుముల కాకరమ్మగు? గరీయత!చేకురు?ప్రేమ!
వలదిక!ద్వేషభావమిల?వరామయ!జీవము నందు?

5.గర్భగత"-భ్రామతి"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.జ.జ.భ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చిరామయ!జీవప్రతీక?క్షేమక మిద్ధర!నెంచన్?
పరార్ధ ప్రయోజక మౌను?భాములెడంజను!
గరీయత  జేకురు!ప్రేమ?కామిద!కీర్తిప్రదంబౌ?
వరామయ!జీవము నందు?భ్రామది నిశ్చల మందున్?

6.గర్భగత"-చిరామయ"వవృత్తము.
ఉత్కృతిఛందము.జ.జ.జ.భ.భ.త.న.ర.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
చిరామయ!జీవప్రతీక!క్షేమక!మిద్ధర!నెంచంచెలిమమికి!లేదు?స్వార్ధము!
పరార్ధ!ప్రయోజకమౌను?భాము!లెడంజను శోభం?బలిదము!శాంతిపూర్ణము!
గరీయత!జేకురు!ప్రేమ?కామిద!కీర్తిప్రధంబౌ?కలుముల!కాకరమ్మగు?
వరామయ!జీవమునందు?భ్రామది!నిశ్చలమందుం?వలదిక!ద్వేషభావమిల?

7.గర్భగత"-గరీయతా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.త.న.ర.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
క్షేమక!మిద్ధర?నెంచం?చెలిమికి!లేస్స్వార్ధము?
భాములెడంజను!శోభం?బలిదము!శాంతి పూర్ణము?
కామిద కీర్తి ప్రదంబౌ?కలుముల కాకరమ్మగు?
భ్రామది!నిశ్చలమందుం?వలదిక!ద్వేషభావమిల?

8.గర్భగత"-జీవప్రతీక"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.త.న.ర.న.భ.భ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
క్షేమక!మిద్ధర!నెంచం?చెలిమికి!లేదు!స్వార్ధము!చిరామయ!జీవప్రతీక?
భాములెడంజను శోభం?బలిదము!శాంతిపూర్ణము?పరార్ధప్రయోజకమౌను!
కామిద కీర్తిప్రదంబౌ?కలుముల!కాకరమ్మగు?గరీయత! చేకురు ప్రేమ?
భ్రామది!నిశ్చల మందుం?వలదిక ద్వేషభావ మిల?వరామయజీవమునందు?

9.గర్భగత"-ప్రాయోజిక"-వృత్తము.
ధృతిఛందము.జ.జ.జ.న.జ.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చిరామయ!జీవప్రతీక?చెలిమికి!లేదు?స్వార్ధము!
పరార్ధప్రయోజక!మౌను!బలిదము!శాంతి పూర్ణము?
గరీయత!చేకురు?ప్రేమ!కలుముల!కాకరమ్మగు?
వరామయ!జీవమునందు?వలదిక?ద్వేషభావ మిల?

10.గర్భగత"-కీర్తికామిద"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.జ.జ.న.జ.భ.భ.భ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
చిరామయ!జీవప్రతీక?చెలిమికిలేదు?స్వార్ధము!క్షేమక!మిద్ధర?నెంచన్?
పరార్ధ ప్రయోజక మౌను!బలిదము!శాంతి పూర్ణము!భాములెడంజను!శోభన్?
వరామయ!జీవమునందు?వలదిక!ద్వేషభావమిల?భ్రామది!నిశ్చలమందున్?
స్వస్తి.
మూర్తి. జుత్తాడ.
 జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పండితోత్తములకు పాదాభి వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.