గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మార్చి 2018, మంగళవారం

శ్రీవల్లభ పై పద్య సమర్చన .. ... .. శ్రీ.భద్రం.వేంకట వేణుగోపాలాచార్యులు

 జైశ్రీరామ్.
కృతికి:-  శ్రీ.భద్రం.వేంకట వేణుగోపాలాచార్యులు.
                అవధానశారదా. వారిసాదరాభిప్రాయము.
                 *********
శ్రీవల్లభ పై
పద్య సమర్చన.
రచన అవధాని శ్రీభద్రం వేంకట వేణుగోపాలాచార్యులు.1.చం. సదమలమైన ఛాందస రసాంచితభావములన్కుదిర్చి మీ
          ముదమునకొత్త పద్యముల పోలికలం!రచనాచణమ్ములన్
          కుదురుగ సత్కవీంద్రుల!మనోహర రీతులు!పంచినారహో!
          పదను నృసింహరాయ!గుణపండిత మండిత!కీర్తి!యబ్బెడిన్!

2.కం.   మీ కవనప్రస్తారం!
            మాకొలది రచనకు!మనసున గూర్చన్!
            చేకొన్న!కొత్త రీతులు
            మీకుం!మీరేను సాటి!మిత్ర వరేణ్యా!

3.ఆ.వె.  వేలకొలది!పద్యజాలము!సమకూర్చి!
              భాషలోని!మథుర భావములను!
              చూరగొను!నృసింహ!జుత్తాడ!సత్కీర్తి!
              పద్య కవిత కబ్బె!భాగ్య మిపుడు!

4.తే.గీ.  భద్రము సదా!తమకు కదా!ముద్రయగుచు!
             ఛందమున నవ్య పద్య ప్రచారమునకు!
             వెలుగు దివ్వె!మీరు! నృసింహ!పెన్నిధి యగు
             పద్య కావ్య జగతికి!సంభారమగుచు!
                     
                                   ఇట్లు,
           భద్రం. వేంకట వేణుగోపాలాచార్యులు.
                  అష్టావధాని. అవధాన శారదా.
                   ఆముదాల వలస.
                     శ్రీకాకుళం.
              సెల్.9440414397.

     జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అక్షయమగు పద్యములను
చక్షువులకు విందు జేసి శ్రవణా నందమిడెన్
యక్షులు కిన్నెర గంధర్వ
పక్షము వారంత వేడ్క బహుప్రీతి యటన్
------------------------------


సోదరులకు విన్నపము.
బాగుందనుకుంటేనే ప్రచురించండి. ఊరికే సరదాగా వ్రాసాను అంతె బాగుండకపోతె మరొక ప్రయత్నం చేస్తాను. సెలవు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.