గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, మార్చి 2018, ఆదివారం

సాదృశీ,అనఘా,మత్తరజినీ,సారనీర,రేపటూహ,జేజేల,రజరారజన,వరామతా, వాసంతికా,లంబచతుర, గర్భజ్ఞానచాతురీవృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
శ్రీవిళంబినామక నూతనతెలుగువత్సరాది శుభాకాంక్షలతోసమర్పించు
సాదృశీ,అనఘా,మత్తరజినీ,సారనీర,రేపటూహ,జేజేల,రజరారజన,వరామతా,
వాసంతికా,లంబచతుర, గర్భజ్ఞానచాతురీవృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

జ్ఞానచాతురీవృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.న.న.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.

శ్రీ"విళంబి"-లంబచతుర!సిరివరామ!రామతం!చేరె!చైత్రుకూడి తాభువిన్!
పావకంబు గూర్ప రమణి!పరమభక్తి!బోధిలం!పార శాంతి!నల్దిశల్సదా!
జై!వసంతి!సంతసమున!జరుగుబాటు!పెంపిలం!సారనీర,క్షీర!పారతన్     
బ్రోవవచ్చె!సామ్యమొనర!పెరలుమెచ్చలోకమున్!భూరికీర్తి!భాసమానమై!

భావము:-మహాచాతుర్యముగల,సిరివరామ!శ్రీవిళంబినామక!వసంతలక్ష్మి
చైత్రునితోకూడి,భూమినిపావక మేర్చుట కరుదెంచెను.భక్తిభావముకల్గించి,
శాంతి నల్దిశల వ్యాపింపజేయ,సంతోషము,జరుగుబాటు,సారనీరక్షీరములు,
నొసగి, సర్వసామ్యతనెలకొల్పి!,పరులుమెచ్చునటుల,గొప్పకీర్తిగలదేశముగ
ప్రకాశింపజేయుటకామె!వచ్చెను.

1.గర్భగత"-సాృశీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.న.గణములు.వృ.సం.491.ప్రాసగలదు.
శ్రీవిళంబి లంబ చతుర!
పావకంబు గూర్ప రమణి!
జై!వసంతి!సంతసమున!
బ్రోవ!వచ్చె!సామ్య మొనర!

2.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88.ప్రాసగలదు.
సిరివరామ!రామతన్!
పరమ భక్తి బోధిలన్!
జరుగుబాటు!పెంపిలన్!
పెరలుమెచ్చ!లోకమున్!

3.గర్భగత"మత్తరజిననీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
చేరె!చైత్రుగూడి! తాభువిన్!
పార శాంతి!నల్దిశల్సదా!
సార నీర క్షీర!పారతన్!
భూరికీర్తి!భాసమానమై!

4.గర్భగత"-సారనీర"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.న.న.ర.లగ.గణములు.యతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
శ్రీవిళంబి లంబచతుర!సిరివరామ!రామతన్!
పావకంబు గుర్పరమణి!పరమభక్తి!బోధిలన్!
జై!వసంత సంతసమున!జరుగుబాటు!పెంపిలన్!
బ్రోవవచ్చె!సామ్యమొనర!పెరలుమెచ్చ!లోకమున్!

5.గర్భగత"-రేపటూహ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.ర.లగ.గణములు.యతి.9.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
సిరి!వరామ!రామతం!చేరె!  చైత్రు!కూడి తాభువిన్!
పరమ భక్తి!బోధిలం! పార శాంతి!నల్దిశల్సదా!
జరుగుబాటు పెంపిలం!సార నీర క్షీర పారతన్!
పెరలు మెచ్చ!లోకముం!భూరికీర్తి !భాసమానమై!

6.గర్భగత"-జేజేల"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.ర.య.జ.భ.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు. 
సిరివరామ రామతం!చేరె!చైత్రుకూడి తాభువిం!శ్రీవిళంబి!లంబ చతుర!పరమభక్తి!బోధిలం!పార!శాంతి!నల్దిశల్సదా!పావకంబుగూర్ప!రమణి!
జరుగుబాటు!పెంపిలం!సార నీర క్షీర పారతం!జైవసంత!సంతసమున!
పెరలుమెచ్చ!లోకముం!భూరికీర్తి భాసమానమై!బ్రోవ!వచ్చె!సామ్యమొనర!

7.గర్భగత"-రజరారజన"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.న.గణములు.యతి.10.వ.యక్షరము
ప్రాసనీమముగలదు.
చేరె!చైత్రు!కూడితా! భువిం!శ్రీవిళంబి!లంబచతుర!
పారశాంతి!నల్దిశల్సదా!పావకంబుగూర్ప!రమణి!
సార నీర క్షీరపారతం!జైవసంత!సంతసమున!
భూరికీర్తి!భాసమానమై!బ్రోవవచ్చె!సామ్యమొనర!

8.గర్భగత"-వరామతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.న.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
చేరె!చైత్రుకూడి!తాభువిం!శ్రీవిళంబి లంబచతుర!సిరివరామ!రామతన్!
పారశాంతి!నల్దిశల్సదా!పావకంబు!గూర్పరమణి!పరమభక్తి!బోధిలన్!
సార!నీర!క్షీర పారతం!జైవసంత!సంతసమున!జరుగుబాటు!పెంపిలన్!
భూరికీర్తి!భాసమానమై!బ్రోవ వచ్చె!సామ్యమొనర!పెరలు!మెచ్చలోకమున్!

9.గర్భగత"-వాసంతికా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.భ.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సిరి వరామ!రామతం!శ్రీవిళంబి!లంబచతుర!
పరమభక్తి!బోధిలం!పావకంబుగూర్ప!రమణి!
జరుగుబాటు!పెంపిలం!జైవసంత!సంతసమున!
పెరలుమెచ్చ!లోకముం!బ్రోవ వచ్చె!సామ్యమొనర!

10.గర్భగత"-లంబచతుర"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.భ.స.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
సిరివరామ!రామతం!శ్రీవిళంబి!లంబచతుర!చేరి!చైత్రు!కూడితా!భువిన్!
పరమభక్తి!బోధిలం!పావకంబుగూర్ప!రమణి!పార శాంతి!నల్దిశల్సదా!
జరుగుబాటు!పెంపిలం!జైవసంత!సంతసమున!సార,నీర,క్షీర!పారతన్!
పెరలుమెచ్చ!లోకముం!బ్రోవవచ్చె!సామ్యమొనర!భూరికీర్తి!భాసమానమై!

స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
మాన్యులు శ్రీ వల్లభవఝుల వారికి , మరిన్ని ఛందస్సుల వెల్లువను మాకందించాలని కోరుతూ , నూతన సంవత్సర శుభాకాంక్షలు .
శ్రీ చింతా సోదరుల అమృత భాండం ఇలాగే వెల్లి విరియాలని , ఉగాది శుభాకాంక్షలతో దీవించి అక్క .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.